Muralidhar Goud: చావుని కోరుకుంటానంటోన్న సీనియర్ నటుడు
ఇండస్ట్రీలో ఎవరెప్పుడు సక్సెస్ అవుతారో ఎవరికీ తెలీదు. ఇప్పుడు అలానే అనుకోకుండా ఫామ్ లోకి వచ్చారు మురళీధర్ గౌడ్(Muralidhar Goud). ఆయన వయసు 50 ఏళ్లకు దగ్గరగా ఉంటుంది. బలగం సినిమాతో ఫేమస్ అయిన ఆయన టిల్లు, మ్యాడ్ ఫ్రాంచైజ్ సినిమాలతో ఆడియన్స్ ను మెప్పించి అందరికీ బాగా దగ్గరయ్యారు.
రీసెంట్ గా మ్యాడ్ స్వ్కేర్(Mad Square)లో తన కామెడీతో అందరినీ ఆకట్టుకున్న మురళీధర్ గౌడ్ తాజాగా ఓ పాడ్కాస్ట్ లో పాల్గొని అందులో తన అభిప్రాయాల్ని షేర్ చేసుకున్నారు. ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ ఆయన్ని దేవుడు వరమిస్తే ఏం కోరుకుంటారని అడగ్గా ఆయన చావుని కోరుకుంటానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు.
ఎందుకలా అంటున్నారని అడిగితే తాను చావుకి రెడీగా ఉన్నానని, తాను ఏమైనా సాధించాలని దేవుడు అనుకుంటే సాధిస్తానని, తన జీవితం ఇప్పటివరకు చాలనిపిస్తుందని, అలా అని ఇప్పుడు జీవితంలో పూర్తి హ్యాపీగా ఉన్నానని కాదని, కష్టాలందరికీ ఉంటాయని ఆయన తెలిపారు. ఈ రోజుల్లో అందరికీ డబ్బు మీద వ్యామోహం పెరిగి బంధాలు, బంధుత్వాల్ని మరిచిపోతున్నారని, కానీ తనకు మాత్రం బంధాలే ముఖ్యమని అన్నారు. లైఫ్ గురించి ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.













