AlluArjun Atlee: అల్లు అర్జున్ సరసన మృణాల్?
పుష్ప2(pushpa2) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) తన తర్వాతి సినిమాను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అట్లీ(Atlee)తో చేయనున్న సంగతి తెలిసిందే. మొన్న అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాను అనౌన్స్ కూడా చేశారు. ఆల్రెడీ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ మొదలయ్యాయి. బన్నీ కూడా ఈ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ను చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.
ఆల్రెడీ ఈ సినిమాలో బన్నీని ఎలా చూపించాలనే దానిపై రీసెంట్ గా ముంబై లో లుక్ టెస్ట్ కూడా ఫినిష్ చేశారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ గురించి ఇప్పుడో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కనున్న సినిమాలో సీతారామం(Sitaramam), హాయ్ నాన్న(Hai Nanna) సినిమాలతో ప్రేక్షకులను అలరించిన మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) నటించనుందని వార్తలొస్తున్నాయి.
గురువారం మృణాల్ పాత్రకు సంబంధించిన లుక్ టెస్ట్ ను నిర్వహించారని, మేకర్స్ ఆమె లుక్ విషయంలో చాలా శాటిస్ఫై అయ్యారని, త్వరలోనే ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించనుందని తెలుస్తోంది. సన్ పిక్చర్స్(Sun Pictures) భారీ బడ్జెట్ తో నిర్మించనున్న ఈ సినిమా జూన్ తర్వాత నుంచి మొదలుకానుంది. ఈ సినిమాకు సాయి అభ్యంకర్(Sai Abhyankar) సంగీతం అందిస్తున్నాడు.






