నెపోటిజంపై మీడియాకు పంచ్ వేసిన మృణాల్
భాషతో సంబంధం లేకుండా ప్రతి ఇండస్ట్రీలో నెపోటిజం గురించి డిస్కషన్స్ జరుగుతూనే ఉంటాయి. అన్ని ఇండస్ట్రీల్లోనూ వారసత్వంతో వచ్చిన హీరోలు, హీరోయిన్లే ఎక్కువ. నెపోటిజం అంటూనే ఉన్నప్పటికీ వారసత్వంతో వస్తున్న నటీనటుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. దీని గురించి చర్చ కూడా ఎప్పటికీ ఆగదు.
నెపోటిజం గురించి స్టార్ కిడ్స్ ను అడిగితే మహా అయితే అది ఎంట్రీ వరకే ఉపయోగపడుతుంది కానీ తర్వాత టాలెంట్ ఉంటేనే ఎవరైనా నెగ్గుకురాగలరు అంటారు. నాన్- నెపో యాక్టర్లను నెపోటిజం వల్ల టాలెంట్ ఉన్న వాళ్లకు అన్యాయం జరుగుతోందా అని మీడియా వాళ్లు రెగ్యులర్ గా అడుగుతుంటారు. దానికి ఎవరికి నచ్చిన సమాధానాలు వారు చెప్తూ ఉంటారు.
రీసెంట్ గా ఇదే ప్రశ్న మృణాల్ ఠాకూర్ కు ఎదురైంది. దానికి అమ్మడు మీడియా మొత్తం షాకయ్యే సమాధానాన్నిచ్చింది. తాను గతంలో ఓ వేడుకలో మీడియాతో మాట్లాడుతున్నానని, అప్పుడే అక్కడకు జాన్వీ కపూర్ వచ్చిందని, దీంతో మీడియా మొత్తం తనను వదిలేసి మైకులు, కెమెరాలు పట్టుకుని తన వైపు వెళ్లిపోయారని చెప్పింది. అంతేకాదు, నెపో కిడ్స్ ను ఎక్కువ హైలైట్ చేసి వారి చుట్టూ తిరిగేది మీడియానే అని, మళ్లీ వాళ్లే నెపోటిజం గురించి తెగ మాట్లాడుతుంటారని మృణాల్ తెగేసి చెప్పింది. దీంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. నెపోటిజంపై మృణాల్ చేసిన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.













