నా జీవితంపై వారి ప్రభావం ఎక్కువ: మృణాల్
సీతారామం, హాయ్ నాన్న సినిమాలతో తెలుగిళ్లలో ఎంతో ఫేమస్ అయిపోయింది మరాఠీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్. సీతారామం సినిమాలో సీతగా, హాయ్ నాన్నలో యష్నగా ఆమె నటించిన తీరుకు అందరూ ఫిదా అయిపోయారు. ఇలాంటి పాత్రలకు మృణాల్ తప్ప మరెవరూ న్యాయం చేయలేరనే రీతిలో నటనను కనబరిచింది మృణాల్.
తనలో ఉన్న ఆ క్వాలిటీనే ఆమెను మంచి స్థాయిలో నిలబెట్టింది. ఎలాంటి అశ్లీలతకు చోటివ్వకుండా మృణాల్ చేసిన ఈ పాత్రలు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించాయి. అయితే మృణాల్ ఇలాంటి పాత్రలు ఎంచుకోవడానికి స్పూర్తి ఎవరో రీసెంట్ గా చెప్పుకొచ్చింది. తనకు సినిమా సెలెక్షన్ విషయంలో ఇద్దరు స్పూర్తి అని మృణాల్ తెలిపింది.
వారిద్దరే రష్మిక మందన్నా, దుల్కర్ సల్మాన్. వీరి ముగ్గురి కాంబోలో సీతారామం వచ్చిన విషయం తెలిసిందే. సీతారామంలో ఆఫ్రిన్ పాత్రలో రష్మిక తప్ప మరో నటి న్యాయం చేయలేదని మృణాల్ చెప్పింది. అంతేకాదు ఆమెకసలు అలసటే ఉండదని, ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుందని తెలిపింది. ఇక్ దుల్కర్ భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తారు. అది ఆయన అంకిత భావానికి నిదర్శనమని మృణాల్ తెలిపింది. వీరిద్దరి ప్రభావం తనపై చాలా బలంగా ఉన్నట్లు అనిపిస్తుందని మృణాల్ అభిప్రాయపడింది. కాగా ప్రస్తుతం మృణాల్, విజయ్ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.













