మృణాల్ సీన్ అయిపోయినట్టేనా?
మృణాల్ ఠాకూర్ సీతారామం సినిమాకు ముందు వేర్వేరు భాషల్లో మొత్తం పది వరకు సినిమాలు చేసింది. కానీ అవేమీ అమ్మడుకి బ్రేక్ ఇవ్వలేదు. ఏ ముహూర్తాన సీతారామం సినిమాకు సైన్ చేసిందో కానీ ఆ సినిమా మృణాల్ కెరీర్ ను మార్చేసింది. సీతా మహాలక్ష్మి, నూర్జహాన్ అనే పాత్రల్లో మృణాల్ తన యాక్టింగ్ తో తెలుగు ఆడియన్స్ గుండెల్ని కొల్లగొట్టింది.
సీతారామం సినిమాతో సూపర్ హిట్ అందుకుని క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న మృణాల్ ఆ తర్వాత నానితో హాయ్ నాన్న సినిమా చేసి మరో హిట్ అందుకుంది. రెండు సినిమాలు సూపర్ హిట్స్ కావడంతో అందరూ మృణాల్ ని లక్కీ హీరోయిన్ అనేశారు. మూడో సినిమాగా విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ చేసింది. కానీ ఆ సినిమా అనుకున్న ఫలితాన్నివ్వకపోగా డిజాస్టర్ గా మిగిలింది.
ఫ్యామిలీ స్టార్ హిట్ అయితే ఈ లోపు మృణాల్ కు మరో అవకాశమొచ్చేదేమో కానీ ఆ సినిమా ఫ్లాప్ అవడంతో అమ్మడికి గట్టి షాక్ తగిలింది. దీంతో ఇప్పుడు మృణాల్ కు ఛాన్స్ ఇవ్వాలంటే నిర్మాతలు ఆలోచిస్తున్నారు. మృణాల్ సందడి మూడు సినిమాలకే ముగిసిందంటున్నారు. ఇదిలా ఉంటే మృణాల్ మాత్రం సాలిడ్ కంబ్యాక్ ఇచ్చేందుకు కథలను వింటూ బిజీగా ఉంది. బాలీవుడ్ లో మాత్రం మృణాల్ పూజా మేరీ జాన్ అనే సినిమా చేస్తుంది. ఆ సినిమా హిట్ అయితే మళ్లీ మృణాల్ కు బాలీవుడ్ లో అవకాశాలొచ్చే వీలుంది.













