క్లాష్ లో వస్తున్న వాళ్లు హిట్ కొడతారా?
రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తోన్న సినిమా మిస్టర్ బచ్చన్. భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా ఆగస్ట్ 15న రిలీజ్ కానుంది. అదే రోజున రామ్- పూరీ జగన్నాధ్ కాంబోలో తెరకెక్కిన డబుల్ ఇస్మార్ట్ కూడా రిలీజ్ కానుంది. దీంతో ఈ రెండు సినిమాల మధ్య ఇప్పుడు కాస్త గట్టి పోటీనే నెలకొంది.
డబుల్ ఇస్మార్ట్ ను ఆగస్ట్ 15న రిలీజ్ చేయనున్నట్లు చాలా రోజుల కిందటే మేకర్స్ అనౌన్స్ చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకు మిస్టర్ బచ్చన్ కూడా అదే రోజున తమ సినిమా రిలీజ్ కానున్నట్లు అనౌన్స్ చేశారు. దీంతో రెండు సినిమాల మధ్య క్లాష్ తప్పనిసరైంది. ఈ రెండు సినిమాల దర్శకులు, హీరోలు తప్పక సక్సెస్ సాధించాల్సిన పరిస్థితుల్లో ఇలా క్లాష్ లో వస్తుండటంపై నెట్టింట ఎన్నో డిస్కషన్స్ జరుగుతున్నాయి.
ఫలితంతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్న రవితేజ గతేడాది కాలంలో రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్తో డిజాస్టర్లు అందుకున్నాడు. దీంతో ఇప్పుడు ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు. హరీష్ శంకర్ నుంచి ఐదేళ్ల తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాతో తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరోవైపు రామ్, పూరీ కూడా ఫ్లాపుల్లోనే ఉన్నారు. వీరికి కూడా డబుల్ ఇస్మార్ట్ హిట్ అవడం ఎంతో అవసరం. మరి ఈ ఇండిపెండెన్స్ వీక్ లో బాక్సాఫీస్ వద్ద ఏ సినిమా నెగ్గుతుందో చూడాలి.













