Mowgli: మోగ్లీ టీజర్ అప్డేట్
సందీప్ రాజ్(sandeep raj) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా మోగ్లీ(mowgli). ఫారెస్ట్ అడ్వెంచర్ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాలో రొమాంటిక్ ట్రీట్మెంట్ కూడా ఉంటుందని, ఆ రొమాంటిక్ ట్రీట్మెంట్ ఆడియన్స్ ను కట్టిపడేయడం ఖాయమని చిత్ర యూనిట్ మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తుండగా, రీసెంట్ గా మేకర్స్ ఈ మూవీ నుంచి ఓ సాలిడ్ అప్డేట్ ను ఇచ్చారు.
మోగ్లీ సినిమా టీజర్ త్వరలోనే రిలీజ్ కాబోతుందనేదే ఆ అప్డేట్. నవంబర్ 12న ఈ టీజర్ రానుందని, దానికి సంబంధించిన ఓ అనౌన్స్మెంట్ పోస్టర్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. సుమ కొడుకు రోషన్ కనకాల(roshan kanakala) హీరోగా తెరకెక్కుతున్న ఈ మూవీలో సాక్షి మదోల్కర్(sakshi madolkar) హీరోయిన్ గా నటిస్తుండగా, బండి సరోజ్ కుమార్(bandi saroj kumar) విలన్ పాత్రలో కనిపించనున్నారు.
మోగ్లీలో రోషన్ ఆడియన్స్ ను తనదైన యాక్టింగ్ తో ఆకట్టుకుంటాడని, ఈ సినిమాతో నటుడిగా మంచ పేరు తెచ్చుకుని, హీరోగా నిలదొక్కుకోవడానికి అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నాడని తెలుస్తోంది. కాల భైరవ(Kala bhairava) సంగీతం అందిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 12న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి మోగ్లీ రోషన్ కు ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.







