Mowgli 2025: ‘మోగ్లీ’ కంటెంట్ అమేజింగ్ గా ఉంది: రానా దగ్గుబాటి
మోగ్లీ కథ అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా సినిమా అందరికీ కనెక్ట్ అవుతుంది: డైరెక్టర్ మారుతి
మోగ్లీ లార్జెస్ట్ స్పాన్ ఇంటెన్స్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ. అందరికీ నచ్చుతుంది: నిర్మాత టిజి విశ్వ ప్రసాద్
మోగ్లీ చేసే యుద్ధంలో అందరూ తోడుండాలని, గెలిపించాలని కోరుకుంటున్నాను: హీరో రోషన్ కనకాల
యంగ్ హీరో రోషన్ కనకాల తన రెండవ చిత్రం మోగ్లీ 2025 తో అలరించబోతున్నారు. జాతీయ అవార్డు గ్రహీత సందీప్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రం ఇప్పటికే టీజర్, పాటలు, ట్రైలర్‌తో స్ట్రాంగ్ బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ చిత్రం డిసెంబర్ 13న రిలీజ్ కానుంది. ప్రీమియర్లు 12న ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో హీరో రానా దగ్గుబాటి, డైరెక్టర్ మారుతి ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.
ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. గుడ్ ఈవెనింగ్. మోగ్లీలో పని చేసిన టెక్నీషియన్స్ అందరితో నాకు చాలా మంచి రిలేషన్షిప్ ఉంది. మారుతి డిఓపి తో బాహుబలి ఆరేడేళ్లు అలా గడిచిపోయాయి. డైరెక్టర్ కాకమునుపే సందీప్ నాకు తెలుసు .కలర్ ఫోటో లాంటి అద్భుతమైన సినిమా చేశాడు. తను ఐదు సంవత్సరాల గ్యాప్ వచ్చిందని చాలా బాధపడుతూ మాట్లాడాడు. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. టైం టెంపరరీ సినిమా అనేది ఫరెవర్. కలర్ ఫోటో లానే మొగ్లీ కూడా ఎప్పటికీ నిలిచిపోయే సినిమా అవుతుంది. హీరో మోగ్లీ, విలన్ నోలన్.. ఈ క్యారెక్టర్లు చూస్తున్నప్పుడే చాలా మ్యాడ్ నెస్ కనిపిస్తుంది. చాలా ప్యాషన్ తో ఈ సినిమా తీశారు. ట్రైలర్లో అద్భుతమైన విజువల్స్ ఉన్నాయి. భైరవ అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చారు. సాక్షి కి ఇది ఫస్ట్ సినిమా. వెల్కమ్ టు ద మూవీస్. విశ్వప్రసాద్ గారు అమేజింగ్ ప్రొడ్యూసర్. ఆయనకి మరిన్ని అద్భుతమైన విజయాలు రావాలని కోరుకుంటున్నాను. నేను ఈ వేడుకకు రావడానికి ప్రధాన కారణం రోషన్. రోషన్ మా ఇంట్లో అబ్బాయి. తనకి సినిమా మీద ఉన్న ప్రేమ పిచ్చి మీరు స్క్రీన్ మీద చూస్తారు. తనని చూస్తుంటే చిరుత సినిమాలో చరణ్ ని చూస్తున్నట్టుగా అనిపించింది. రోషన్ కి ఆల్ ది వెరీ బెస్ట్. సింహం 12న వస్తుంది. మోగ్లీ 13న వస్తున్నాడు. ఆల్ ది వెరీ బెస్ట్. అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. తప్పకుండా ఈ సినిమాని మీరందరూ థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను.
ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈవెంట్ కి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న రానా గారికి థాంక్యూ. ఎన్టీఆర్ గారు రామ్ చరణ్ గారు నాని గారు మా సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ ఎక్స్ట్రార్డినరీ. లాస్ట్ వీక్ జరిగిన కొన్ని పరిస్థితుల వలన ఒక పెద్ద సినిమాతో మేము రావాల్సివస్తుంది. ఒక రోజు ఆలస్యంగా రావడం వల్ల ఆ సినిమా చూసిన అందరూ మా సినిమాని కూడా చూస్తారని కోరుకుంటున్నాం. ఈ సినిమాకి ఏ సర్టిఫికెట్ వచ్చింది. అయితే దీనికి కారణం ఒక ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ .బండి సరోజ్ ఆ పర్ఫామెన్స్ ఇచ్చారు. సినిమా మొదలైన ఐదు నిమిషాల్లోనే మీరు ఆ ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. రోషన్ సాక్షి చాలా అద్భుతంగా నటించారు .ఈ సినిమా లార్జెస్ట్ స్పాన్ ఇంటెన్స్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ. అందరికీ ఈ సినిమా నచ్చుతుందని కోరుకుంటున్నాను.
హీరో రోషన్ కనకాల మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. మీడియా మిత్రులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ప్రతి ప్రేక్షక దేవుడికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. బాలయ్య గారి ఆశీస్సులు ఆయన ఫ్యాన్స్ ఆశీస్సులు మాకు ఉండాలని కోరుకుంటున్నాను. మంచి సినిమాని ముందుకు తీసుకెళుతున్న రానా గారికి థాంక్యూ సో మచ్. ఒక అద్భుతమైన స్క్రిప్ట్ ని తీసుకొచ్చి నాతో సినిమా చేసిన డైరెక్టర్ సందీప్ రాజు గారికి థాంక్యూ సో మచ్. సినిమాని ప్రొడ్యూస్ చేసి మా అందరిని సపోర్ట్ చేసిన విశ్వప్రసాద్ గారికి థాంక్యూ. ఈ సినిమాని చాలా డిగ్నిటీ తో ముందుకు తీసుకువచ్చారు. చాలా ప్రేమతో సినిమా చేశారు. కాలభైరవ తన మ్యూజిక్ తో సినిమాని ఎలివేట్ చేశాడు. టీం అందరూ చాలా డెడికేటెడ్ గా వర్క్ చేశారు. సాక్షి అద్భుతంగా చేసింది. హర్ష పెర్ఫార్మర్ డిఫరెంట్ గా వుంటుంది. బండి సరోజ్ గారు చాలా జెన్యూన్ పర్సన్. ఆయన పెర్ఫార్మన్స్ ని థియేటర్స్ లో చూడ్డానికి నేను వెయిట్ చేస్తున్నాను. మోగ్లీ తన ప్రేమ కోసం చేసిన యుద్ధం ఈ కత. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక యుద్ధం ఉంటుంది. యుద్ధంలో మనం గట్టిగా నిలబడి పోరాడాలి. మనల్ని మనం నమ్మాలి. అందరూ కూడా మోగ్లీ చేసే యుద్ధంలో తోడుండాలని కోరుకుంటున్నాను. గెలిపించాలని కోరుకుంటున్నాను. డిసెంబర్ 13న థియేటర్స్ లో సినిమా చూసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.
డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ… సందీప్ చాలా టాలెంటెడ్. ఈ కథ చెప్పినప్పుడు నాకు చాలా నచ్చింది. తన బిగినింగ్ నుంచి ఈ కథని రోషన్ తోనే చేయాలని భావించాడు. తను కన్న కల ఇక్కడి వరకు తీసుకొచ్చాడు. తన సంకల్పం చాలా గొప్పది. బాలయ్య గారి సినిమాతో పాటు మోగ్లీ సినిమా రావడం ఇంకా చాలామందికి ఈ సినిమా ఒకటి వస్తుందని తెలిసింది. శంకర్ దాదా సినిమా వచ్చేటప్పుడు ఆనంద్ కూడా వచ్చింది. అలా వచ్చింది కాబట్టి చాలామందికి ఆనంద్ గురించి తెలిసింది. ఆ రెండు సినిమాలు చూశారు. బాలయ్య బాబు గారి బ్లెస్సింగ్ తో సందీప్ ఎదగాలని కోరుకుంటున్నాను. మనం ఎప్పుడు కూడా నెగిటివ్ గా ఉండకూడదు. పీపుల్ మీడియా సంస్థ నుంచి అన్ని రకాల సినిమాలు వస్తున్నాయి. విశ్వ గారు ఇండస్ట్రీని ఎంత పోషిస్తున్నారో నాకు తెలుసు. ఈ సినిమా ద్వారా మరొక అద్భుతమైన సక్సెస్ ఇచ్చి పీపుల్ మీడియా సంస్థ ఇలాంటి సినిమాలు మరెన్నో రావాలని కోరుకుంటున్నాను. బండి సరోజ్ గారిని ఎంచుకోవడం ఈ సినిమాకి మరో సక్సెస్. ఆయనకు నేను ఫ్యాన్ ని. ఈ టీం ని బ్లెస్స్ చేయడానికి వచ్చిన రానా గారికి థాంక్యూ. ఆయన మంచి సినిమాని ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తున్నారు. ఈ సినిమా అద్భుతంగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
మూవీ డైరెక్టర్ సందీప్ రాజ్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఐదేళ్ల గ్యాప్ తర్వాత నా సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జరగడం చాలా ఆనందంగా ఉంది. అద్భుతమైన టీం ఉండడంవల్ల మేము అనుకున్నది అనుకున్నట్టుగా జరిగింది. డిసెంబర్ 12న రిలీజ్ అనుకున్నాం. అయితే అఖండ కొన్ని కారణాలవల్ల వాయిదా పడి డిసెంబర్ 12 కి రావడంతో చాలా డిస్టర్బ్ అయ్యాను. మా సినిమా ఫిబ్రవరి కి వెళ్లే పరిస్థితి వస్తుందని కొందరు అన్నారు. చాలా అప్సెట్ అయ్యాను. అయితే ఇది చాలా మంచి సినిమా. సినిమాపై నమ్మకంతో డిసెంబర్ 13న వస్తున్నాము. చాలా కష్టపడి సినిమా చేశామా. ఈ సినిమాలో నటించిన నటీనటులు టెక్నీషియన్స్ అందరూ కూడా అద్భుతమైన వర్క్ ఇచ్చారు. అందరూ కూడా ప్రాణం పెట్టి పని చేశారు. వొళ్ళు దగ్గర పెట్టి తీసిన సినిమా ఇది. ఎక్కడ దారి తప్పదు. 1% కూడా మిస్ అవ్వదు. భైరవ తన మ్యూజిక్ తో సినిమాని మరో లెవల్ కి తీసుకెళ్లాడు. హర్ష అద్భుతమిన పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. అందులో బంటి క్యారెక్టర్ మీ అందరిని ఆకట్టుకుంటుంది. సాక్షి అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చింది. తను చాలా పెద్ద స్టార్ అవుతుంది. ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ ని ప్రాణం పెట్టి రాసుకున్నాను.
సరోజ్ గారు ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు అది విలన్ కాదు యాంటీ హీరో అని అర్థమైంది. స్టార్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. రోషన్ తో జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి తనలో మొగ్లీని చూడడం మొదలుపెట్టాను. తను ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేసాడు. ఇందులో ఒక్క గ్రీన్ మ్యాట్ షాట్ కూడా ఉండదు. ప్రతిదీ ఒరిజినల్ గా చేసాడు. రోషన్ ఇచ్చిన సపోర్ట్ వల్లే సినిమా ఎంత అద్భుతంగా వచ్చింది. తను పడిన కష్టానికి తప్పకుండా ఫలితం వస్తుంది. ఈ సినిమాని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించిన విశ్వప్రసాద్ గారికి ధన్యవాదాలు. ఈ సినిమా చాలా ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు. రాన్ గారు ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ కథ రాసిన తర్వాత ఫస్ట్ విన్న వ్యక్తి మారుతి గారు. ఆయన ఇచ్చిన నమ్మకం మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చింది. చాలా మంచి ఐడియాలు ఇస్తూ హెల్ప్ చేశారు. మొగ్లీ 13వ తారీఖున రిలీజ్ కాబోతోంది కచ్చితంగా మీ అందరికీ కిక్కిస్తుంది. మీ అందరికీ నచ్చుతుంది. ప్రేక్షకుడి సమయానికి వ్యాల్యూ ఇచ్చి తీసిన సినిమా ఇది. కామెడీ యాక్షన్ డ్రామా విపరీతంగా ఎంజాయ్ చేస్తారు.
బండి సరోజ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. నాకు ఇండస్ట్రీలో ఒకే ఒక గాడ్ ఫాదర్ సురేష్ బాబు గారు. వారి అబ్బాయి పాన్ ఇండియా స్టార్, ప్రొడ్యూసర్ రానా గారికి ధన్యవాదాలు. బాలకృష్ణ గారి సినిమా అంటే మర్రిచెట్టు. దాని పక్క చిన్న ముక్క కూడా మొలిచే అవకాశం ఉంటుందని మా నిర్మాత విశ్వప్రసాద్ గారు మమ్మల్ని ప్రోత్సహించి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకి ధన్యవాదాలు. ఈ సినిమాని నేను యూట్యూబ్ లో చేసే సినిమాలు కి ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. పరాక్రమం అనే సినిమా థియేటర్లో కూడా విడుదల చేశాను. కానీ సరైన పబ్లిసిటీ లేకపోవడం వల్ల అది చేరలేదు. ఈ సినిమాని అందరికీ చేర్చేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో నేను యాంటీ హీరోని. మాంగల్యంలో చూసిన దొరబాబు.. బిగ్ స్క్రీన్ పై ఎలా చూస్తే ఎలా ఉంటుందో అదే రేజ్ ఉంటుంది. అలాంటి పాత్ర రాసిన మా డైరెక్టర్ సందీప్ రాజు గారికి థాంక్యూ. ఈ సినిమాని అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టికెట్ 99 రూపాయలు మాత్రమే. దయచేసి మీతో పాటు మీ ఫ్యామిలీని కూడా తీసుకురండి. సందీప్ రాజు నాతో చేయించిన రూత్ లెస్ పర్ఫామెన్స్ మీరందరూ చూడాలి. నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను. ఇందులో పోలీస్ స్టేషన్లో ఒక ఫైట్ ఉంటుంది. టాలీవుడ్ లో వచ్చిన బెస్ట్ ఫైట్స్ లో టాప్ టెన్ లో ఉంటుంది. ఈ సినిమాకి పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు
డైరెక్టర్ రవికాంత్ పేరేపు మాట్లాడుతూ.. సినిమా సందీప్ నాకు చూపించడు. చాలా బాగుంది. ఈ సినిమాతో నా తమ్ముడు రోషన్ మరో పది మెట్లు ఎదగాలని కోరుకుంటున్నాను. సందీప్ కోసం ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలి. సరోజ్ గారు సినిమాలో చాలా బాగా చేశారు సినిమా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్ముతున్నాను.
డైరెక్టర్ హేమంత్ మధుకర్ మాట్లాడుతూ.. కొన్ని సినిమా ఫస్ట్ లుక్ నుంచే ఒక పాజిటివిటీ కనిపిస్తుంది ఈ సినిమా కూడా ఫస్ట్ లుక్ నుంచే ఒక ఇంట్రెస్ట్ క్యూరియాసిటీ వచ్చింది. ట్రైలర్ చూసిన తర్వాత పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని అనిపిస్తుంది. రోషన్ గారికి ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది. తనని చూస్తుంటే ఒక ఫ్యూచర్ స్టార్ కనిపిస్తున్నారు. విశ్వప్రసాద్ గారికి అభినందనలు. ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను
హీరోయిన్ సాక్షి మాట్లాడుతూ.. ఇది నా మొదటి సినిమానే కాదు ఇది నా హార్ట్. మీ అందరి ప్రేమ సపోర్టుకి థాంక్యూ. మోగ్లీ టీం నాకు ఫ్యామిలీ లాగా అయిపోయారు. నాకు ఈ సినిమా లో ఇంత అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ సందీప్ రాజు గారికి థాంక్ యూ. రోషన్ వండర్ఫుల్ కో యాక్టర్. తనతో నటించడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. హర్ష గారి సపోర్టుకి థాంక్యూ. సరోజ్ వేరే లెవెల్. బైరవ గారి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. డిసెంబర్ 13న ఈ సినిమా మీ ముందుకు వస్తుంది. తప్పకుండా అందరూ థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను.
వైవా హర్ష మాట్లాడుతూ… పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వలన చాలా కుటుంబాలు బ్రతుకుతున్నాయి. ఈ సినిమాని ఇంత అద్భుతంగా నిర్మించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వ ప్రసాద్ గారికి ధన్యవాదాలు. సాక్షి అద్భుతంగా తన పాత్రలో నటించింది. రోషన్ చాలా అనుభవం ఉన్న హీరోల ఈ సినిమాలో నటించాడు. తన యాక్టింగ్ చూస్తున్నప్పుడు చాలా అద్భుతంగా అనిపించింది. తన నుంచి కూడా చాలా విషయాలు నేర్చుకున్నాను. సరోజన్నకి ఇప్పటికే ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సినిమాలో పని చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమాని డిసెంబర్ 13న ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను
మైత్రి డిస్ట్రిబ్యూటర్ అందరికీ ధన్యవాదాలు.. ఈ సినిమా ఈ మధ్యనే చూశాను. విలన్ గా బండి సరోజ్ గారి నటన అద్భుతం. అధ్యంతం ఆకట్టుకునేలా నటించారు. ఇందులో ఇద్దరు అద్భుతమైన ప్రేమికులు కనిపించారు. ఒక అద్భుతమైన సినిమా. ఆడియో కూడా చాలా అద్భుతంగా ఉంది. కొన్ని సీన్లు చూస్తున్నప్పుడు వేరే లెవెల్ అనిపించింది. ఇదొక మాస్ లవ్ సినిమా. ప్రతి ఒక్కరిని థియేటర్స్ లో రంజింప చేస్తుందని నమ్మకం ఉంది.
లిరిక్ రైటర్ చంద్రబోస్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. సినిమా యూనిట్ అందరికీ అభినందనలు. డైరెక్టర్ సందీప్ రాజ్ అత్యంత ప్రతిభావంతుడు. ఇందులో ఒక పాటని సృష్టించిన సందర్భంగా నా మనసుని ఎంతగానో ఆకట్టుకుంది. ఈ పాట మారేడుమిల్లిలో రాశాను. అది ఎప్పటికీ మర్చిపోలేను. ఒక ధైర్యాన్ని ఇచ్చే పాట రాశాను. ఈ సినిమా విజయ శబ్దం చాలా భారీగా ఘనంగా వినిపించబోతుంది. ఈ ఈవెంట్ లో మూవీ టీం అందరూ పాల్గొన్నారు.






