Mowgli 2025: ‘మోగ్లీ’ కి ఆడియన్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది : టీజీ విశ్వ ప్రసాద్
యంగ్ హీరో రోషన్ కనకాల లేటెస్ట్ వైల్డ్ బ్లాక్ బస్టర్ ‘మోగ్లీ 2025’. జాతీయ అవార్డు గ్రహీత సందీప్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమా ప్రీమియర్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం డిసెంబర్ 13న వరల్డ్ వైడ్ విడుదలై వైల్డ్ బ్లాక్ బస్టర్ గా అలరిస్తూ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు.
వైల్డ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ లో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. మాకు ఎంతగానో సపోర్ట్ చేసిన మీడియాకి థాంక్యూ. ఈ సినిమా రిలీజ్ డేట్ డిసెంబర్ 12 అనుకున్నప్పుడు ఒక మంచి డేట్ దొరికింది అనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు వేరే కార్పొరేట్ కంపెనీ చేసిన ఇష్యూ వలన ఒక పెద్ద సినిమా డిసెంబర్ 12 కి వచ్చింది. అప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలో అర్థం కాలేదు. మళ్లీ మూవ్ చేయాలంటే ఒక స్లాట్ దొరకలేదు. ఒక్క రోజు వెనక్కి జరిగితే వర్క్ అవుట్ అవుతుందనిపించింది. నిన్న 22 ప్రీమియర్స్ వేసాము. మోగ్లీ లాంటి సైజ్ వున్న సినిమాకి 90% ఆక్యుపెన్స్ రావడం అనేది బిగ్ థింగ్. సినిమాకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఒక పెద్ద స్పాన్ ఉన్న సినిమాని బడ్జెట్లో చాలా చక్కగా తీశాం. రోషన్ కి ఒక మంచి సినిమా ఇచ్చామని అనుకుంటున్నాం. రానున్న రోజుల్లో సినిమా ఇంకా అద్భుతంగా ముందుకు వెళ్తుందని భావిస్తున్నాం.
హీరో రోషన్ కనకాల మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. మీడియా మిత్రులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అందరి సపోర్ట్ తోనే ఈ సినిమా చాలా ముందుకు వెళ్ళింది. నిర్మాత విశ్వప్రసాద్ గారు ఈ సినిమాకి కథకి ఏం కావాలో అన్నీ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా గ్రాండ్ గా సినిమాని నిర్మించారు. వారు మాపై పెట్టిన నమ్మకం మాకు ఎంతో బలాన్ని ఇచ్చింది. నేను హర్ష చేసిన సన్నివేశాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయని ముందే చెప్పాను ఈరోజు ఆడియన్స్ ఆ ఎమోషన్ ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. సాక్షి తన క్యారెక్టర్ ని అద్భుతంగా పెర్ఫామ్ చేసింది. ఈ సినిమానే నా జీవితం అనుకున్నాను. ఒక్క నిమిషం కూడా రిలాక్స్ అవ్వకుండా వర్క్ చేశాను. ఆడియన్స్ ఇచ్చిన రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఒక గొప్ప రిలీఫ్ ఇచ్చింది. థియేటర్స్ లో కొన్ని మూమెంట్స్ కి చాలా అద్భుతంగా రెస్పాండ్ అయ్యారు. అవన్నీ చూస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. నాకు ఇంత మంచి సినిమా ఇచ్చిన డైరెక్టర్ సందీప్ గారికి థాంక్యూ. నా రెండో సినిమాకి ఎలాంటి కథ పడడం నా అదృష్టం. మా సినిమా టికెట్టు 99 రూపాయలు మాత్రమే. సరదాగా ఫ్యామిలీతో కలిసి సినిమాకి వెళ్ళండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. చాలా ఎంజాయ్ చేస్తారు
డైరెక్టర్ సందీప్ రాజ్ మాట్లాడుతూ.. ఈ సినిమాని అందరికీ నమస్కారం. ఈ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. థియేటర్స్ లో వస్తున్న రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. సినిమాని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. కామెడీ ఎమోషన్ అన్నిటికీ కనెక్ట్ అవుతున్నారు. ఈ సినిమా ఇంకా ఎక్కువ మంది ఆడియన్స్ కి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇప్పటివరకు సినిమా చాలా బాగుందని కాల్స్, మెసేజులు వస్తున్నాయి. మరింత ఎక్కువ మంది థియేటర్స్ కి వెళ్లి ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాను.
హీరోయిన్ సాక్షి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మీడియా సపోర్ట్ లేకుండా ఈ సినిమా రీచ్ అవ్వడం కష్టం. నా పాత్రకు అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చిన ఆడియన్స్ అందరికీ థాంక్యూ. దర్శక నిర్మాతలకు, మా హీరో రోషన్ గారికి థాంక్ యూ. మీ అందరి రెస్పాన్స్ నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.
వైవా హర్ష మాట్లాడుతూ.. మీడియా అందరికీ థాంక్యూ. సినిమాకి ఆడియన్స్ చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చారు. నిన్న ప్రీమియర్ షోస్ కూడా అన్ని ఫుల్ అయ్యాయి. 99 రూపాయలకే ఈ సినిమా టికెట్ ఇవ్వడం జరుగుతుంది. రిపీట్ ఆడియన్స్ కూడా వస్తున్నారు. మా టీమ్ అందరికీ ఇది ప్రౌడ్ మూమెంట్. సినిమాకి సపోర్ట్ చేసిన అందరికీ థాంక్యూ.






