ఈ దసరా సినిమాలివే!
దసరా(Dusserha)కు టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలు రావడం కామనే. సంక్రాంతి(sankranthi) తర్వాత ఎక్కువ హాలీడేస్ ఎక్కువగా ఉండే సీజన్ కావడంతో వీలైనంత ఎక్కువగా ఈ ఛాన్స్ ను వాడుకునేందుకు నిర్మాతలు ట్రై చేస్తారు. కానీ ఈసారి బరిలో టైర్1 హీరోలెవరూ లేరు. అలా అని పోటీ లేదనేం కాదు. ఈసారి పోటీ బాగానే ఉంది.
అన్నిటికంటే ముందుగా అక్టోబర్ 10 బరిలో దిగుతున్న రజినీకాంత్(Rajinikanth) వేట్టయాన్(Vettayan) మీద తెలుగులో ఎక్కువ అంచనాలేం కాదుఏ కానీ జైలర్(Jailer) లాగా సర్ప్రైజ్ హిట్ అవుతుందేమోననే నమ్మకం ఫ్యాన్స్ లో చాలా బలంగా ఉంది. డబ్బింగ్ వెర్షన్ అయినా సరే మంచి సంఖ్యలో థియేటర్లు దొరకనున్నాయి. ఇక తర్వాత 11న గోపీచంద్(gopichand) విశ్వం(Vishwam) రానుంది. శ్రీను వైట్ల(Sreenu Vaitla) ఫ్లాపుల్లో ఉండటం వల్ల ఆయన బ్రాండ్ ఏమీ పెద్దగా పని చేయడం లేదు.
కాబట్టి విశ్వం భారమంతా ప్రమోషన్స్ పైనే ఉంది. దాన్ని పెంచేలా ట్రైలర్స్, సాంగ్స్ కట్ చేస్తున్నట్లు టాక్. సుధీర్ బాబు(Sudheer Babu) మా నాన్న సూపర్ హీరో(Maa Nanna Super Hero) పేరుతో ఫ్యామిలీ డ్రామాతో ఆడియన్స్ ముందుకు ఉన్నాడు. ఈ సినిమాకు యువి క్రియేషన్స్(UV Creations) బ్యాకప్ ఉండటంతో ఎక్కువ సంఖ్యలో థియేటర్లు దక్కే అవకాశముంది. కన్నడ సినిమా మార్టిన్(Martin) ఏకంగా 11 భాషల్లో రిలీజ్ కానుంది. వీటితో పాటూ అలియా భట్(Alia Bhatt) జిగ్రా(Jigra)కు తెలుగు డబ్బింగ్ కూడా అదే రోజు రానుంది. ఇక 12న సుహాస్(Suhas) జనక అయితే గనక(JAnaka Ayithe Ganaka) సినిమాను దిల్ రాజు(Dil Raju) భారీ ఎత్తున రిలీజ్ చేయున్నాడు. బడ్జెట్ పరంగా చిన్న సినిమా అయినప్పటికీ బలగం సినిమాలా మ్యాజిక్ చేస్తుందని భావిస్తున్నాడు. అదే రోజున త్రిప్తి డిమ్రి(Tripti Dimri) నటించిన విక్కీ విద్య కా వో వాలా వీడియో కూడా రిలీజ్ కానుంది.













