మోక్షజ్ఞ కోసం రవీనా కూతురు?
నందమూరి ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురుచూసిన మోక్షజ్ఞ(Mokshagna) వెండితెర అరంగేట్రం డైరెక్టర్ ప్రశాంత్ వర్మ(Prasanth Varma) ద్వారా జరుగుతున్న విషయం తెలిసిందే. మోక్షజ్ఞ బర్త్ డే సందర్భంగా ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తూ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇంకా సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కాలేదు. అయితే ఇప్పుడు ఈ సినిమా క్యాస్టింగ్ కు సంబంధించిన ఆసక్తికర వార్తొకటి నెట్టింట వినిపిస్తోంది.
ఈ సినిమాలో మోక్షజ్ఞ సరసన హీరోయిన్ గా నటించడానికి రషా తదాని(rasha tadani) పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలోనే రషా తదానీని రామ్ చరణ్(ram charan)- బుచ్చిబాబు(buchi babu) ప్రాజెక్టు కోసం ట్రై చేశారు. కానీ ఫైనల్ గా ఆ సినిమాలో జాన్వీని తీసుకున్నారు. అయితే ఈ రషా తదానీ ఎవరో కాదు. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్(Raveena tandon) కూతురే.
1993లో బంగారు బుల్లోడు(bangaru bullodu) సినిమాలో బాలకృష్ణ(balakrishna) సరసన రమ్యకృష్ణ(ramya krishna)తో పాటూ హీరోయిన్ గా నటించిన ఈమె ఆ సినిమా హిట్టయినా టాలీవుడ్ లో కంటిన్యూ అవకుండా బాలీవుడ్ కు వెళ్లింది. రవీనా తన కూతురిని సౌత్ లో లాంచ్ చేయడానికి మోక్షజ్ఞ కంటే బెస్ట్ ఆప్షన్ దొరకదు కాబట్టి చాలా గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఇంకా అఫీషియల్ గా కన్ఫర్మేషన్ రాలేదు కాబట్టి అప్పటివరకు వెయిట్ చేయాల్సిందే. భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజయ్యే ఛాన్సుంది.













