Vrushabha: మోహన్ లాల్ ప్రెస్టీజియస్ మూవీ “వృషభ” ట్రైలర్ రిలీజ్
మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటిస్తున్న ప్రెస్జీజియస్ మూవీ “వృషభ”. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ తెలుగు ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తోంది. ఈ నెల 25 “వృషభ” సినిమా గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ద్వారా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని కన్నెక్ట్ మీడియా, బాలాజీ టెలిఫిల్మ్స్, అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్ బ్యానర్లపై శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్, సి.కె. పద్మ కుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ ఎస్ వ్యాస్, ప్రవీర్ సింగ్, విశాల్ గుర్నాని, జూహి పరేఖ్ మెహతా నిర్మిస్తున్నారు. విమల్ లహోటి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న “వృషభ” సినిమాను దర్శకుడు నందకిషోర్ మలయాళం, తెలుగులో రూపొందించారు. తాజాగా “వృషభ” సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. సరికొత్త సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇచ్చేలా ఉన్న ఈ ట్రైలర్ ఇన్ స్టంట్ గా మూవీ లవర్స్ ను ఆకట్టుకుంటోంది.
“వృషభ” సినిమా ట్రైలర్ ఎలా ఉందో చూస్తే – బిజినెస్ మ్యాన్ ఆఫ్ ది సెంచరీగా పేరు తెచ్చుకుని వ్యాపార రంగంలో ఖ్యాతి సంపాదిస్తాడు ఆదిదేవ వర్మ (మోహన్ లాల్). ఈ లెజెండరీ బిజినెస్ మ్యాన్ కు శత్రువులు ఎక్కువే. కెరీర్ లో తిరుగులేని ఆదిదేవ వర్మ మానసికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాడు. అతనికి తన గత జన్మ జ్ఞాపకాలు గుర్తుకువస్తుంటాయి. ఆ జ్ఞాపకాల్లో రాజా విజయేంద్ర వృషభ (మోహన్ లాల్) అసమాన యోధుడిగా తన సామ్రాజ్యాన్ని, ప్రజల్ని కాపాడుకుంటూ ఉంటాడు. ఆదిదేవ వర్మ కొడుకు (సమర్జీత్ లంకేష్) సైకియాట్రిస్టులతో సంప్రదింపులు చేస్తూ, శత్రు దాడుల నుంచి తండ్రిని కాపాడుకుంటూ ఉంటాడు. ఆదిదేవ వర్మను వెంటాడుతున్నవి పునర్జన్మ జ్ఞాపకాలేనా, ఆ జ్ఞాపకాల్లోని రాజా విజయేంద్ర వృషభ గొప్పతనం ఏంటి, ఈ గతాన్ని, ఈ వర్తమానాన్ని కలుపుతూ కథ ఎలాంటి మలుపులతో సాగింది అనేది ట్రైలర్ లో ఆసక్తి కలిగించింది. హై టెక్నికల్ వ్యాల్యూస్, స్టార్ కాస్టింగ్ తో విజువల్ వండర్ గా “వృషభ” సినిమా ఉండబోతున్నట్లు ట్రైలర్ ప్రామిస్ చేస్తోంది.






