Mohanlal: ఆ యాడ్ తో అందరినీ ఆశ్చర్యపరిచిన మోహన్ లాల్
మోహన్ లాల్(mohanlal) గురించి, ఆయన టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఆయన ఎన్నో సార్లు గొప్ప నటుడిగా ప్రూవ్ చేసుకున్నారు. ఇక ఆయన కొత్తగా ఇప్పుడు నిరూపించుకోవాల్సిందేమీ లేదు. అయినా ఈ వయసులో కూడా యంగ్ హీరోలకు సమానంగా సవాళ్లను ఎదుర్కొంటూ కెరీర్లో భిన్నంగా ముందుకు దూసుకెళ్తున్నారు.
అసలు విషయానికొస్తే రీసెంట్ గా మోహన్ లాల్ ఓ కమర్షియల్ యాడ్ చేశారు. ఆ యాడ్ లో ఆడవాళ్లు వేసుకునే జ్యుయలరీ ధరించి, అచ్చు ఆడవారిలానే హావభావాలు పలికించి అందరినీ ఆశ్చర్యపరిచారు. మోహన్ లాల్ చేసిన ఆ యాడ్ చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోక మానరు. మామూలుగా ఎక్కడైనా జ్యుయలరీ యాడ్ అంటే హీరోయిన్ లేదా మోడల్ చేస్తుంది.
కానీ ఈ యాడ్ లో మోహన్ లాల్ కనిపించారు. యాడ్ లో కనిపించడమే కాకుండా ఆయా ఆభరణాలను మెడలో ధరించారు. మెడలో నెక్లెస్, చేతికి గాజు, వేళ్లకు రింగ్ పెట్టుకుని ఎలాగైతే ఆడవాళ్లు అద్దంలో తమను తాము చూసుకుని మురిసిపోతారో అలానే మురిసిపోయారు. ఈ యాడ్ లో ఆయన చేసిన యాక్టింగ్, పలికించిన హావ భావాలు అందరినీ ఆశ్చర్యపరుస్తుండటంతో ఇలాంటి రేర్ ఫీట్స్ ను ఆయన తప్ప మరెవరూ చేయలేరని ఆ యాడ్ కు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.







