Chiru-Bobby: చిరూ మూవీలో మోహన్ లాల్?
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi) లైనప్ ప్రస్తుతం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఫామ్ పరంగా చూసుకుంటే చిరూ(Chiru) చెప్పుకోదగ్గ ఫామ్ లో లేరు అయినప్పటికీ ఆయన లైనప్ చూస్తుంటే ఫ్యాన్స్ కు మంచి ఇంప్రెషన్ కలుగుతుంది. ప్రస్తుతం మన శంకరవరప్రసాద్ గారు(Mana Shankaravaraprasad Garu) సినిమా చేస్తున్న చిరూ, ఆ సినిమాను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రెడీ అవుతున్నారు.
ఆ సినిమా తర్వాత చిరూ, బాబీ కొల్లి(Bobby kolli) దర్శకత్వంలో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఆల్రెడీ వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో వాల్తేరు వీరయ్య(Waltair Veerayya) సినిమా వచ్చి మంచి హిట్టైన నేపథ్యంలో ఈ సినిమాపై కూడా అందరికీ మంచి అంచనాలున్నాయి. దానికి తగ్గట్టే రీసెంట్ గా ఈ మూవీ నుంచి రిలీజైన కాన్సెప్ట్ పోస్టర్ ఫ్యాన్స్ లో సినిమాపై ఉన్న అంచనాలను పెంచేసింది.
కాగా ఈ మూవీ గురించి ఇప్పుడో ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట హాట్ టాపిక్ అయింది. ఈ సినిమాలో చిరూతో పాటూ మరో స్టార్ హీరో కూడా కీలక పాత్రలో కనిపిస్తారని వార్తలు రాగా, మొదట్లో ఆ కీలక పాత్రలో తమిళ హీరో కార్తీ(Karthi) కనిపిస్తాడన్నారు కానీ ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ఆ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohan Lal) కనిపిస్తారని అంటున్నారు. ఇదే నిజమైతే మెగాస్టార్, మోహన్ లాల్ కాంబినేషన్ స్క్రీన్ పై రచ్చ చేయడం ఖాయం. కెవిఎన్ ప్రొడక్షన్స్(KVN Productions) బ్యానర్ లో రూపొందనున్న ఈ మూవీ 2026 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.






