మోహన్ బాబు కు జగన్ న్యాయం చేస్తాడా?
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఆయనకు నచ్చితే ప్రాణం పెడతారు,నచ్చలేదా జీవితాంతం వెలి వేస్తారు.గతం లో మెగాస్టార్ చిరంజీవికి దూరంగా వున్నా మోహన్ బాబు ఆ మధ్య జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మీటింగ్ లో కలుసుకున్నప్పటినుండి మల్లి దగ్గరయ్యారు. నిన్న మెగాస్టార్ పుట్టున రోజు సందర్భంగా ఓ కాలకృతిని చెక్కతో చేసిన మోటారు సైకిని బహుమతిగా ఇచ్చారు. అయితే ఆయన సినిమాల్లో డైలాగులు ఎలా పేలుస్తారో రీల్ లైఫ్ లో కూడా అంతకు మించి బాబులే పేలుస్తారు.ఇక మోహన్ బాబు తో పెట్టుకోవాలి అంటే ఆయన మనసెరిగి ప్రవర్తించాలని అయన సన్నిహితులు చెపుతారు. ఇదిలా ఉండగా తాజాగా మోహన్ బాబు మీడియా ఇంటర్వ్యూలో చంద్రబాబుని చీల్చిచెండాడారు, సి బి ఎన్ ని చచ్చిన పాముతో పోల్చారు. తనకు రాజకీయంగా దెబ్బేసిన వ్యక్తి అంటూ ఇండైరెక్ట్ గా కామెంట్ చేసారు.
ఇవన్నీ ఇలా ఉంటే జగన్ మీద మాత్రం మోహన్ బాబు ప్రశంసల జల్లు కురిపించారు. ఏపీలో జగన్ పాలన చాలా బాగుందని ప్రజలకు న్యాయం చేస్తున్నాడు అంటూ కితాబు ఇచ్చారు. ఇక తన విద్యా సంస్థలకు చెల్లించాల్సిన ఫీజు రీ ఇంబర్స్ మెంట్ విషయంలో కూడా జగన్ క్లారిటీ ఇచ్చారని మోహన్ బాబు చెప్పుకున్నారు. ఈ మధ్య మోహన్ బాబు కుమారుడు, జగన్ కి వరుసకు బావ అయిన విష్ణు జగన్ వద్దకు వెళ్లారని కూడా మోహన్ బాబు చెప్పారు. అంటే మోహన్ బాబు వైపు నుంచి కదలిక వచ్చింది. జగన్ వద్దకు కుమారుడు వెళ్లాడు. ఈ పరిణామాలతో మళ్లీ మోహన్ బాబు పదవుల గురించి కూడా చర్చ ఆసక్తికరంగా సాగుతోంది.
మోహన్ బాబుకు రాజ్యసభకు వెళ్ళాలని కోరిక ఉంది. గతంలో పెద్దాయన యన్ టి ఆర్ సన్నిహితంగా వున్నపుడు ఆయన నెగ్గారు. ఆ తరువాత చంద్రబాబు రాజకీయంగా ఎలాంటి ప్రత్యేక పదవీ ఇవ్వలేదు. ఇక జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చింది. దాంతో తొలి విడతలో రాజ్యసభ సీటు ఖాయమని మోహన్ బాబే కాదు, పార్టీ లో అంతా అనుకున్నారు. కానీ అదిరాలేదు. 2022లో రాజ్యసభ సీట్లు ఆరు దాకా వైసీపీకి వస్తాయి. అందులో ఒక సీటు మోహన్ బాబుకు ఇస్తారని అంటున్నారు. మొత్తానికి మోహన్ బాబుకు జగన్ న్యాయం చేస్తారని వినిపిస్తున్న మాట.













