Mohan Babu: ‘ది ప్యారడైజ్’ నుంచి శికంజ మాలిక్ గా మోహన్ బాబు పవర్ ఫుల్ లుక్స్ రిలీజ్

ది ప్యారడైజ్ (The Paradise) మోస్ట్ ఎవైటెడ్ చిత్రాలలో ఒకటి, ప్రతి అప్‌డేట్ ఈ సినిమా కోసం ఎక్సయిట్మెంట్ పెంచుతుంది. ఈ చిత్రం ఇప్పటికే హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. నేచురల్ స్టార్ నాని ‘జడల్’ గా కనిపించడం సంచలనం సృష్టిస్తోంది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రంలోని ప్రతి అంశాన్ని చాలా జాగ్రత్తగా రూపొందిస్తున్నారు. ఈ రోజు మేకర్స్ వెటరన్ స్టార్ మోహన్ బాబు ‘శికంజ మాలిక్’ గా ది ప్యారడైజ్ లో పవర్ ఫుల్ విలన్ పాత్రను పోషిస్తున్నారని అనౌన్స్ చేశారు. ఇది సినిమాపై బజ్ ని మరింతగా పెంచుతుంది.
దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చాలా కాలం తర్వాత లెజెండరీ మోహన్ బాబును బిగ్ స్క్రీన్ పైకి తీసుకువస్తున్నారు. పవర్ ఫుల్ విలన్ గా చూపిస్తున్నారు. ఈ పాత్ర విన్న వెంటనే మోహన్‌బాబు గారిని అద్భుతంగా ఆకట్టుకుంది, వెంటనే అంగీకరించారు. తన కోసం రాసిన పాత్ర విన్న తర్వాత దర్శకుడు శ్రీకాంత్ అభిమానిగా మారిపోయారు.
మోహన్‌బాబు ఐకానిక్ చారిస్మాను అద్భుతంగా ప్రజెంట్ చేస్తూ రెండు పవర్ లుక్స్ రిలీజ్ చేశారు మేకర్స్. షర్ట్ లేకుండా గన్, కత్తి పట్టుకుని సిగార్ కాలుస్తూ రగ్గడ్ అండ్ ఇంటెన్స్ లుక్ అదిరిపోయింది. మరో లుక్ లో రెట్రో అవతార్ లో సిగార్ కాలుస్తూ భుజంమీద గన్ పెట్టుకొని స్వాగ్ తో నడుచుకుంటూ వస్తున్నట్లు ప్రజంట్ చేసి లుక్ మైండ్ బ్లోయింగ్ గా వుంది. ఈ రెండు లుక్స్ అద్భుతమైన రెస్పాన్స్ తో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పవర్, ఇంటెన్సిటీ, స్టైల్‌తో క్రాఫ్ట్ చేసిన ఈ పాత్రలో మోహన్‌బాబు గారి ప్రత్యేకతైన పంచ్ డైలాగ్స్, మానరిజమ్స్ ఫ్యాన్స్‌కి పండగలా ఉండబోతున్నాయి. ‘డైలాగ్ కింగ్’ ఇమేజ్‌కు తగిన విధంగా ఆయన మెస్మరైజ్ చేయబోతున్నారు.
ఎస్‌ఎల్‌వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
ఈ సినిమా 2026 మార్చి 26న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాళీ, ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో విడుదల కానుంది. ది ప్యారడైజ్ ఇండియన్ సినిమాని ప్రపంచవ్యాప్తంగా సెలబ్రేట్ చేసుకునే పాన్-వరల్డ్ స్పెక్టకిల్‌గా నిలవనుంది.