Mohan Babu: ప్యారడైజ్ క్లిక్ అయితే మోహన్ బాబు బిజీ అవడం ఖాయమే

మంచు మోహన్ బాబు(manchu mohan babu) ఎంత గొప్ప నటుడనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో మంచి మంచి పాత్రలు చేసిన ఆయన గత 20 ఏళ్లుగా పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. ఒకప్పుడు నటుడిగా బిజీగా ఉన్న ఆయన ఎందుకనో కానీ లైమ్ లైట్ లో లేకుండా పోయారు. ఆయన ఓకే అనాలే కానీ ఎంతోమంది డైరెక్టర్లు ఆయనకు ఛాన్సులివ్వడానికి రెడీగా క్యూ కడతారు.
అయితే గత కొన్నేళ్లుగా సినిమాల్లో పెద్దగా యాక్టివ్ గా లేని మోహన్ బాబు ను డైరెక్టర్ శ్రీకాంత్(srikanth) ఎలా ఒప్పించాడో ఏమో తెలియదు కానీ నేచురల్ స్టార్ నాని(Nani) హీరోగా తెరకెక్కుతున్న ది ప్యారడైజ్(the paradise) సినిమాలో విలన్ వేషానికి ఓకె చెప్పించుకున్నాడు. నాని సినిమాలో మోహన్ బాబు విలన్ అంటే ఆ ఊహే గొప్పగా ఉంది. ఇక స్క్రీన్ పై వారిద్దరి ఫైటింగ్ ఎలా ఉంటుందో చూడాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఆడియన్స్.
ఆల్రెడీ ది ప్యారడైజ్ పై భారీ అంచనాలుండగా, రీసెంట్ గా మేకర్స్ మోహన్ బాబు లుక్ ను రివీల్ చేశారు. ఆ లుక్ లో మోహన్ బాబు ను అందరూ శ్రీకాంత్ ను మెచ్చుకుంటున్నారు. అంతా బావుండి సినిమాలో మోహన్ బాబు రోల్ సరిగ్గా పండితే మాత్రం ఆయన నటుడిగా మరింత బిజీ అయ్యే అవకాశముంది. మరి ఈ సినిమాలో మోహన్ బాబు పాత్ర ఎలా ఉంటుందనేది చూడాలి.