Mohan Babu: అరడజను పిల్లలతో సంతోషంగా ఉండు!

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్(prabhas) బర్త్ డే ఈరోజు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులతో పాటూ పలువురు సెలబ్రిటీలు ప్రభాస్ కు బర్త్ డే విషెస్ ను తెలియచేస్తున్నారు. అందులో భాగంగా టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు(manchu mohan babu) పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ ఓ ట్వీట్ చేశారు.
మై డియర్ డార్లింగ్ బావా.. నువ్వు చిత్ర పరిశ్రమకే గర్వకారణం, నువ్వు మరెన్నో పుట్టినరోజుల్ని జరుపుకుని, సంతోషంతో లైఫ్ లాంగ్ ఆనందంగా ఉండాలి, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలి. అలానే త్వరలోనే పెళ్లి చేసుకుని కొత్త లైఫ్ ను స్టార్ట్ చేసి, అరడజను పిల్లల్ని కని సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నా అని మోహన్ బాబు ప్రభాస్ బర్త్ డే సందర్భంగా పోస్ట్ చేశారు.
మోహన్ బాబు ట్వీట్ చూస్తుంటే ప్రభాస్ పెళ్లి గురించి అతని కుటుంబ సభ్యులు, అభిమానులతో పాటూ యావత్ చిత్ర పరిశ్రమ కూడా ఎదురుచూస్తుందని అర్థమవుతుంది. కాగా మోహన్ బాబు చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆయన ట్వీట్ కు రిప్లై ఇస్తూ ఇదేం విడ్డూరం, పెళ్లి గురించే మాట్లాడటం లేదంటే ఏకంగా పిల్లలంటున్నారని కామెంట్స్ చేస్తున్నారు.
https://x.com/themohanbabu/status/1981242547482534252