Kannappa: ఆ హగ్ కోసం 22 ఏళ్లు ఎదురుచూశా!

మంచు విష్ణు(manchu vishnu) ప్రధాన పాత్రలో ముకేష్ కుమార్ సింగ్(mukesh kumar singh) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కన్నప్ప(kannappa). శ్రీకాళహస్తి స్థల పురాణం గురించి తెలియచెప్పే సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్(Prabhas), అక్షయ్ కుమార్(akshay kumar), మోహన్ లాల్(Mohan lal), కాజల్(kajal), మోహన్ బాబు(mohan babu), బ్రహ్మానందం(brahmanandam) కీలక పాత్రల్లో నటించారు. జూన్ 27న కన్నప్ప ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రెండ్రోజుల కిందట రిలీజ్ చేసిన ట్రైలర్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. కొచ్చిలో ట్రైలర్ ను లాంచ్ చేసి మలయాళ ఆడియన్స్ ను ఆకట్టుకున్న కన్నప్ప టీమ్ తమిళ ఆడియన్స్ ను ఇంప్రెస్ చేయడానికి సూపర్ స్టార్ రజనీ సాయం తీసుకున్నారు. మోహన్ బాబు ఫ్యామిలీకి రజినీకాంత్(rajinikanth) తో మంచి సాన్నిహిత్యం ఉందనే సంగతి తెలిసిందే.
మోహన్ బాబు- రజినీకాంత్ కలిసి నటించిన కన్నప్ప పెదరాయుడు(pedarayudu) సినిమా ఆదివారంతో 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సెలబ్రేషన్స్ లో భాగంగా రజినీని కలిసిన మోహన్ బాబు, విష్ణు తాము తీసిన కన్నప్ప సినిమాను తలైవాకు చూపించారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ విష్ణు ట్వీట్ చేశాడు. గత రాత్రి రజినీ అంకుల్ కన్నప్ప సినిమా చూశారని, సినిమా పూర్తయ్యాక ఆయన తనను గట్టిగా హగ్ చేసుకుని సినిమా తనకెంతో నచ్చిందని చెప్పారని, ఓ నటుడిగా ఈ హగ్ కోసం 22 ఏళ్లు ఎదురుచూశానని, ఆయన నన్ను ఎంకరేజ్ చేసినట్టు అనిపిస్తుందని దానికి సంబంధించిన ఫోటోలను ట్వీట్ చేస్తూ ఎమోషనల్ అయ్యాడు విష్ణు. ప్రస్తుతం విష్ణు చేసిన ఆ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.
https://x.com/iVishnuManchu/status/1934554394500161618