Mitra Mandali: ‘మిత్ర మండలి’ని మైండ్‌తో కాకుండా హార్ట్‌తో చూడండి – హీరో శ్రీ విష్ణు

బడ్డీ కామెడీగా ఆద్యంతం నవ్వించేలా బీవీ వర్క్స్ బ్యానర్ మీద బన్నీ వాస్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్ మీద కళ్యాణ్ మంతెన, భాను ప్రతాప, డా. విజేందర్ రెడ్డి తీగల నిర్మించిన చిత్రం ‘మిత్ర మండలి’ (Mitra Mandali). ఈ మూవీలో ప్రియదర్శి, నిహారిక ఎన్ ఎం హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు విజయేందర్ దర్శకత్వం వహించారు. బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, సత్య, విష్ణు ఓయి, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా, విటివి గణేష్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 16న విడుదల చేస్తున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, పాటలకు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో సోమవారం (అక్టోబర్ 13) నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ హీరో శ్రీ విష్ణు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో..
శ్రీ విష్ణు మాట్లాడుతూ .. ‘‘తిప్పరామీసం’ టైంలో విజయ్ ఏడీగా పని చేశారు. ‘మిత్ర మండలి’ పెద్ద హిట్ అవుతుంది. విజయ్ కోసం ఫ్రెండ్స్ అందరూ ఇలా వచ్చి సపోర్ట్ చేయడం ఆనందంగా ఉంది. రాగ్ మయూర్, విష్ణు, ప్రసాద్ ఇలా అందరూ నాకు ఇష్టం. ప్రియదర్శి ఎప్పుడూ ఎనర్జీగానే ఉంటాడు. ఆయన మంచి కథల్ని ఎంచుకుంటూ ఉంటాడు. ఇలానే ఎప్పుడూ మంచి కథలు, సినిమాల్ని చేస్తూ వెళ్లాలి. నిహారిక రీల్స్ నేను చూస్తుండేవాడిని. తెలుగులో ఆమె ఇంకా ఎన్నో చిత్రాలు చేయాలి. ఈ చిత్రంలో పాటలు బాగున్నాయి. నిర్మాతలైన కళ్యాణ్, భాను, సోము, విజేందర్ అందరూ కూడా నాకు స్నేహితులు. బన్నీ వాస్ గారు నెలకి ఒక సూపర్ హిట్ మూవీని అందిస్తున్నారు. ఆయన ఉన్నారంటే సినిమా హిట్ గ్యారెంటీ. అంత నమ్మకంగా ఉన్నారు కాబట్టే అక్టోబర్ 15న ప్రీమియర్లు వేస్తున్నారు. ఈ మూవీని మైండ్‌తో కాకుండా, మనసుతో చూడండి. అందరినీ నవ్విస్తుంది. నేను ఈ చిత్రాన్ని చూశాను. చాలా సీక్వెన్స్‌లు అదిరిపోయాయి. ‘మిత్ర మండలి’ ఫుల్లుగా ఎంటర్టైన్ చేసి థియేటర్ నుంచి బయటకు పంపించేస్తుంది’ అని అన్నారు.
ప్రియదర్శి మాట్లాడుతూ .. ‘మా ‘మిత్ర మిండలి’ మూవీ ఈవెంట్ కోసం వచ్చిన శ్రీ విష్ణు గారికి థాంక్స్. ‘మిత్ర మండలి’ సినిమా బాగా వచ్చింది. నేను ఆల్రెడీ మూవీని చూశాను. ఈ చిత్రం మీకు నచ్చకపోతే.. నెక్ట్స్ వచ్చే నా ఏ సినిమాని కూడా చూడకండి. ‘మిత్ర మండలి’తో దీపావళిని మేం మీ కోసం ముందుగానే తీసుకు వస్తున్నాం. అక్టోబర్ 16న ఫ్రెండ్స్, ఫ్యామిలీతో వెళ్లి మా చిత్రాన్ని చూడండి’ అని అన్నారు.
బన్నీ వాస్ మాట్లాడుతూ .. ‘మా కోసం వచ్చిన శ్రీ విష్ణు గారికి థాంక్స్. ‘మిత్ర మండలి’ కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ప్రియదర్శి నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టమైన వ్యక్తి. ‘మిత్ర మండలి’ చిత్రం చాలా బాగా వచ్చింది. దీపావళికి ఫ్యామిలీని నవ్వించే క్లీన్ ఎంటర్టైనర్. అందరినీ హాయిగా నవ్వించే మా సినిమాను అక్టోబర్ 16న రిలీజ్ చేస్తున్నాం. అందరూ వచ్చి మా మూవీని చూసి ఎంజాయ్ చేయండి. విజయ్, అనుదీప్, కళ్యాణ్, ఆదిత్య హాసన్ ఫ్రెండ్‌షిప్ చూస్తుంటే నాకు ఆనందంగా ఉంది. విజేందర్ అన్న చాలా మంచి వ్యక్తి. భాను, కళ్యాణ్‌లకు థాంక్స్. నా టీం ట్రైలర్ కింద నెగెటివ్ కామెంట్లు చూపించింది. ఎక్కడ నవ్వాలి అనే కామెంట్ ఉంది. సినిమాకు రండి ప్రతీ సీన్‌కు నవ్వుతారు. నా సినిమానే ఆడాలని నేను ఎప్పుడూ స్వార్థంగా ఆలోచించను. అన్ని సినిమాలు ఆడాలి.. అన్నీ హిట్ అవ్వాలి. మంచి చిత్రాల్ని ఆడియెన్స్ ఎప్పుడూ ఆదరిస్తారు. మన మూవీ బాగుండాలని పక్కన చిత్రాల్ని తక్కువ చేయడం, ట్రోలింగ్ చేయించడం, నెగెటివ్ ప్రచారం చేయించడం తప్పు. పోటీ అనేది ఎప్పుడూ ధర్మంగా ఉండాలి. నేను ధర్మం వైపు ఉంటాను. అక్టోబర్ 16న రాబోతోన్న నాలుగు చిత్రాలు పెద్ద హిట్ అవ్వాలి’ అని అన్నారు.
నిహారిక ఎన్ ఎం మాట్లాడుతూ .. ‘‘మిత్ర మండలి’తో నేను తెలుగు పరిశ్రమలోకి వస్తున్నాను. అందరి సహకారంతో ఇక్కడి వరకు వచ్చాం. మా కోసం వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. అక్టోబర్ 16న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి హిట్ చేయండి’ అని అన్నారు.
డైరెక్టర్ విజయేందర్ మాట్లాడుతూ .. ‘నేను శ్రీ విష్ణు గారి ‘తిప్పరామీసం’ సినిమాకు మొదటి సారిగా పని చేశాను. అలా నా జర్నీ ప్రారంభమైంది. ఈ రోజు ఇలా నా సినిమా ఈవెంట్‌కు ఆయన గెస్ట్‌గా రావడం ఆనందంగా ఉంది. ఈ ప్రయాణంలో సపోర్ట్ చేసిన బన్నీ వాస్ గారికి థాంక్స్. ఈ జర్నీలో నాకు తోడుగా నిలిచిన ప్రియదర్శి, నిహారిక, విష్ణు, రాగ్ మయూర్ ఇలా టీం అందరికీ థాంక్స్. నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చిన నిర్మాతలకు థాంక్స్. ‘మిత్ర మండలి’ సినిమా చాలా బాగా వచ్చింది. అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.
నిర్మాత భాను ప్రతాప మాట్లాడుతూ .. ‘‘మిత్ర మండలి’ చిత్రం చాలా బాగా వచ్చింది. అక్టోబర్ 16న మా చిత్రం రాబోతోంది. అయితే అక్టోబర్ 15న మేం ప్రీమియర్లు వేస్తున్నాం. మా కంటెంట్‌ను సోషల్ మీడియాలో చాలా సపోర్ట్ చేస్తున్నారు. హేటర్స్ వల్లే మేం మరింతగా ముందుకు వెళ్తున్నాం. మా చిత్రం చూడటానికి వచ్చిన ప్రతీ ఒక్కరినీ నవ్విస్తాం’ అని అన్నారు.
నిర్మాత డా. విజేందర్ రెడ్డి తీగల మాట్లాడుతూ .. ‘‘హాయ్ నాన్న’ తరువాత మళ్లీ ప్రియదర్శితో కలిసి పని చేస్తున్నాను. మాకు సపోర్ట్ చేసిన ‘మిత్ర మండలి’ టీం అందరికీ థాంక్స్. ఇది కచ్చితంగా పైసా వసూల్ చిత్రం అవుతుంది. అక్టోబర్ 16న మా మూవీ రాబోతోంది. మా సినిమా అందరినీ నవ్విస్తుంది. అందరూ వచ్చి చూడండి’ అని అన్నారు.
సంగీత దర్శకుడు ధృవన్ మాట్లాడుతూ .. ‘‘మిత్ర మండలి’ ఈవెంట్ కోసం వచ్చిన శ్రీ విష్ణు గారికి థాంక్స్. ఇంత మంచి ప్రాజెక్ట్‌లో నాకు అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. ‘మిత్ర మండలి’ ప్రయాణం నాకెంతో మెమరబుల్‌గా ఉంటుంది. ఈ మూవీతో నాకు మంచి మిత్ర బృందం దొరికింది. ఈ చిత్రం, అందులోని పాత్రలు అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. అక్టోబర్ 16న ఈ మూవీ రాబోతోంది. ఈ సినిమాతో మీ దీపావళి మరింత కలర్ ఫులర్‌గా మారుతుంది’ అని అన్నారు.
ఈ కార్యక్రమంలో దర్శకులు అనుదీప్ కేవీ, కళ్యాణ్ శంకర్, వివేక్ ఆత్రేయ, ఆదిత్య హాసన్ వంటి వారు సందడి చేశారు.