Meher Ramesh: పవన్ కోసం పడిగాపులు కాస్తున్న మెహర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan) పాలిటిక్స్ లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ తాను కమిట్ అయిన అన్ని సినిమాలను ఎంతో వేగంగా పూర్తి చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే ఆల్రెడీ హరిహర వీరమల్లు(Hari hara veeramallu), ఓజి(OG) సినిమాలను పూర్తి చేసి రిలీజ్ చేశారు పవన్. అతని తర్వాతి సినిమా ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad bhagath singh) షూటింగ్ ను కూడా ఇప్పటికే ఫినిష్ చేశాడు పవన్.
అయితే ఓజి తర్వాత ఓజి యూనివర్స్ లో సినిమాలు రానున్నాయని పవనే స్వయంగా చెప్పడంతో ఆయనకు తర్వాత కూడా సినిమాలు చేసే ఇంట్రెస్ట్ ఉందని అందరికీ క్లారిటీ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆయనతో సినిమాలు చేయడానికి ఎంతో మంది రెడీ అవుతున్నారు. అందులో భాగంగానే పవన్ తో మూవీ చేయాలని ఓ డైరెక్టర్ ఎంతో వెయిట్ చేస్తున్నాడట.
ఆయన మరెవరో కాదు, మెహర్ రమేష్(Meher ramesh). ఇప్పటికే మెహర్, పవన్ ను పలుమార్లు కలిశారని, వీరమల్లు లొకేషన్ లో కూడా మెహర్ పవన్ ను కలిశారని అంటున్నారు. బిల్లా(Billa) సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న మెహర్ ఎన్నో సినిమాలు చేసినప్పటికీ స్టార్ డైరెక్టర మాత్రం కాలేకపోయాడు. అతను తీసిన సినిమాలన్నీ ఫ్లాపులే అయ్యాయి. అలాంటి మెహర్ తో తమ హీరో సినిమా చేయనున్నాడని వస్తున్న వార్తలను విని పవన్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. మరి మెహర్ తో పవన్ సినిమా చేస్తాడా లేదా అన్నది చూడాలి.