నెక్ట్స్ షెడ్యూల్‌కు రెడీ అవుతున్న మెగాస్టార్
భోళా శంకర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, యంగ్ డైరెక్టర్ వశిష్టతో చేస్తున్న ఫాంటసీ మూవీ విశ్వంభర. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని షెడ్యూల్స్ పలు చోట్ల జరిగాయి. హైదరాబాద్‌లో ఈ సినిమా కోసం ఏకంగా 13 స్పెషల్ సెట్స్ వేసి అక్కడ కూడా షూటింగ్ జరిపారు. కేవలం ఆ సెట్స్ కోసమే కొన్ని కోట్ల రూపాయలను నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ ఖర్చు పెట్టింది.
సోషియో ఫాంటసీ సినిమా కావడంతో సినిమా దాదాపుగా సెట్స్ లోనే షూటింగ్ జరపాల్సి ఉంటుంది. ఇప్పటికే పలు సెట్స్ లో షూటింగ్ జరపగా, ఇంకా చాలా సెట్స్ లో షూటింగ్ పెండింగ్ ఉంది. రీసెంట్ గా చిరూ అమెరికా పర్యటన కోసం షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు. చిరూ ఇప్పుడు ఇండియాకు తిరిగి వచ్చేశాడు. సినిమా తర్వాతి షెడ్యూల్ ను ఈ నెల 26 నుంచి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
చిరంజీవితో పాటూ మిగిలిన కీలక నటులంతా ఈ షెడ్యూల్ లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. అంతే కాదు ఈ సినిమా కోసం ఇషా చావ్లా, సురభిలను కూడా టీమ్ కీలక పాత్రల కోసం ఎంపిక చేసిందట. నెక్ట్స్ షెడ్యూల్ లో వీళ్లు కూడా జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది. త్రిష ఇప్పటికే షూటింగ్ లో జాయినైంది. వీటితో పాటూ కొన్ని కీలకమైన ఫైట్ సీక్వెన్స్ ను కూడా ఈ షెడ్యూల్ లో షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. దానికోసం ప్రముఖ స్టంట్ మాస్టర్లను రంగంలోకి దించుతున్నారట. మొత్తానికి ఈ నెల 26 నుంచి సెట్స్ లోకి మెగాస్టార్ విశ్వరూపం చూడటం ఖాయమన్నమాట.













