మెగాస్టార్ న్యూ ఫిల్మ్ అప్డేట్
వాల్తేరు వీరయ్య సక్సెస్ తో ఫుల్ జోష్ మీదున్న చిరంజీవి, తన తాజా సినిమా భోళా శంకర్ ను మెహర్ రమేష్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆగస్ట్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. రీసెంట్గా భోళా శంకర్ డబ్బింగ్ పూర్తి చేసుకుని భార్యతో వెకేషన్‌కి వెళ్లిన చిరూ, తిరిగి వచ్చాక తన కొత్త సినిమా షూటింగ్ మొదలుపెట్టనున్నట్లు చెప్పారు.
గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో మెగాస్టార్ కూతురు సుస్మిత ఈ సినిమాను నిర్మించనుండగా, బంగార్రాజు ఫేమ్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించనున్నాడు. ఆగస్ట్ 22న మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నట్లు ఇప్పటికే సమాచారం అందుతుంది. కాగా గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కనున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం.
కాగా ప్రస్తుతం చిరూ అమెరికా పర్యటనలో ఉండగా త్వరలోనే ట్రిప్ ముగించుకుని ఇండియా రానున్నాడు. చిరూ ఇండియా వచ్చాకే తన తర్వాతి సినిమా అనౌన్స్మెంట్, భోళాశంకర్ ప్రమోషన్స్ వేగవంతం కానున్నాయి. కళ్యాణ్ కృష్ణతో కాకుండా చిరూ బింబిసార డైరెక్టర్ వశిష్ఠతో కూడా ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.













