చిరంజీవి మనకు అండగా ఉన్నాడనే మాట నాకు ఎంతో సంతృప్తి నిచ్చింది – మెగాస్టార్ చిరంజీవి
ప్రస్తుతం నడుస్తున్న ఈ కరోనా వైరస్ ప్రబలుతున్నా సంక్షోభ కాలంలో సినిమా షూటింగ్‌లు లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న సినీ కార్మికులకు చేయూత నిచ్చేందుకు మెగాస్టార్ చిరంజీవి ఛైర్మన్‌గా ఏర్పాటైన కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ)తో దాని తరపున వచ్చిన రూ.8 కోట్ల రూపాయ విరాళాన్ని సినీ కార్మికుకు నిత్యావసర వస్తువును అందచేయడానికి ఉపయోగిస్తున్నారు. సరైన సమయానికి సహాయం అందడం తో తెలుగు సినీ పరిశ్రమ కార్మికులకు ఆభాద్బాంధవుడు గా కనిపిస్తున్నారు మెగాస్టార్ చిరంరంజీవి. సూపర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఆచార్య’. ఈ సినిమా చిత్రీకరణలో ఉన్నప్పుడు కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్‌ను ప్రకటించారు. దాంతో ఎంటైర్ సినీ పరిశ్రమలో షూటింగ్స్ ఆగిపోయాయి. ఈ క్వారంటైన్ సమయంలో చిరంజీవి ఏం చేస్తున్నారనే విషయాల గురించి ఆయనతో మాట్లాతూ….
సీసీసీ ఏర్పాటు చేయాలనే ఆలోచన మీకు ఎప్పడు వచ్చింది?
– చాలా సందర్భాలో కొన్ని విపత్కర పరిస్థితులలో నేను కూడా ప్రభుత్వాలకు విరాళాలు ఇవ్వడం జరిగింది. అయితే ఈ పరిశ్రమలో ఉంటూ లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులకి ఎలాంటి వేతనం కానీ, ఆదాయం ఉండదు. అలాంటప్పుడు వారు ఎలా జీవనాన్ని సాగిస్తారు? ముందు వారికి సహాయంగా నిలపడాలి. నేను ఈ రోజు సినీ పరిశ్రమ లో నిలదొక్కున్నానంటే వారు కూడా నాకు వెన్ను దన్నుగా నిలపడిన వారే నా కుటుంబ సభ్యులే అలాంటి నావారి కనీస అవసరాలని తీర్చాల్సిన భాద్యత ఎంతయినా ఉంది. అనే ఆలోచనలోంచి పుట్టిందే సి.సి.సి. అందుకోసం ముందు నేను కొంత డబ్బు వారికి ఇవ్వాలి తర్వాత ఆ డబ్బు వస్తువుగా ఎలా మారుతుంది అని ఆలోచించాలి అనుకున్నాను. వెంటనే అనౌన్స్ కూడా చేశాను. నేన అనౌన్స్ చేసిన రోజు నుండి నా మీద నమ్మకంతో ఈ రోజువరకూ సి.సి.సి కి విరాళాల పరంపర కొనసాగుతూనే వుంది. దీని మూలoగా మొదట ఐదు నుండి ఎనిమిది వేల మందికి సహాయం అందిద్దాం అనుకున్నాం కానీ ఈ రోజున 12000 మందికి సహాయం చేస్తున్నాం. సి.సి.సి కి నాతో పాటు పనిచేయడానికి తమ్మారెడ్డి భరద్వాజ, సురేష్ బాబు, సి కళ్యాణ్, యన్.శంకర్, దామోదర్ ప్రసాద్, మెహర్ రమేష్ లు వున్నారు. దీని వెనకా ఇంకా చాలా మంది కష్టం ఉంది వారందరిని ఈ సందర్భంగా వారందరిని అభినందిస్తున్నాను.
రక్తదానం చేయమని మీరే మళ్ళి స్వయంగా పిలుపునిచ్చారు?
– ‘చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్’ ఆధ్వర్యంలో మా చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో ఉన్నటువంటి బ్లడ్ కొరత ఏర్పడుతుంది. మా వద్దే కాదు లాక్ డౌన్ విధించినప్పటినుండి ఏ బ్లడ్ బ్యాంక్‌లో రక్త నిలువలు నిండుకున్నాయి. ఈ విషయం మీద మీరు కొంత అవగాహన కల్పించాలి అని మా వాళ్ళు చెప్పడంతో మిగతా బ్లడ్ బ్యాంక్‌లు ఎలా ఉన్నాయో అని కనుక్కోవడం జరిగింది. వారు కూడా కొరత ఉన్నది వాస్తవం కానీ మీలాంటి వారు పిలుపునిస్తే గనక తప్పకుండా మనం దాన్ని అధిగమించ వచ్చు అని చెప్పారు. దాంతో వెంటనే కొంత శ్రీకాంత్, బెనర్జీ అలాగే కొంత మంది సెలెబ్రెటీతో కలిసి వెళ్లి నేను కూడా స్వయంగా బ్లడ్ ఇవ్వడం జరిగింది.
చిరంజీవి మనకు అండగా ఉన్నాడని అనడం మీకెలా అనిపిస్తోంది?
– సైరా సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు కొన్ని వేల మంది రోజూ షూటింగ్ కి వస్తుండేవారు. వారందరికీ కూడా టైం కి పేమెంట్ ఇచ్చేవాళ్ళం. దాంతో ఆ మూడు నెల పాటు చాలా చక్కగా సినిమా గురించి చెప్పుకునే వారు. ఆ డబ్బుతోనే ఇది నిజమైన సంక్రాంతి అంటూ అనుకునే వారు అది నా దాకా కూడా వచ్చింది. నాకు చాలా సంతృప్తిగా అనిపించింది. అదే విధంగా ఈ సమయంలోకూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కడుపునిండా తినాలి అని చేసిన ప్రయత్నానికి కూడా అలాంటి స్పందన వస్తుంటే చాలా తృప్తిగా ఉంది. ఇదే కదా కళామ తల్లికి తిరిగి ఋణం తీర్చుకోవడం అంటే అనిపించింది. కొద్ది మొత్తమ్ తో నేను చారిటి ని ప్రారంభించి ఉండొచ్చు కానీ చిరంజీవి అనుకుంటే తప్పకుండా లబ్దిదారులకు చేరుతుంది అనే నమ్మకం ఏర్పడడం ఎంతో గర్వంగా ఉంది. ముఖ్యంగా రామోజీ రావు గారి లాంటి పెద్ద వ్యక్తి ప్రశంసించడం ఆనందంగా ఉంది.
మోడీ గారి ట్వీట్ గురించి ?
– మన దేశాధినేత ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించి ప్రశంసించడం చాలా గొప్ప విషయం. ఇలాంటివి మరికొన్ని విస్తృతంగా చేయాలి అనేంతగా ప్రోత్స్తాహం లభించింది. ఈ సందర్భంగా మన భారత ప్రధాని మోడీ గారిని నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
అమితాబ్ బచ్చన్ గారితో మీ అనుబంధం గురించి?
– నాకు అమితాబ్ గారు అంటే ఎప్పటినుంచో వెలకట్టలేని అభిమానం. హిందీ లో నా మొదటి సినిమా ‘ప్రతిబంద్’ చేసినపుడు ఆ సినిమాని ముందుగా ఆయనకు చూపించాలి, ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవాలి అనుకోని 1990 ఆగష్టులో చూపించడం జరిగింది. అదే మా మొదటి పరిచయం. ఆ తర్వాత నా సినిమాలు చూసి ఆయన ప్రశంసించడం నాకు ఎనలేని ఉత్సాహాన్ని ఇచ్చింది. ఆ తర్వాత దగ్గరలో షూటింగ్ జరుగుతుంటే బ్రేక్ సమయంలో మేము కలు సుకునే వాళ్ళం. అలా మా ఇద్దరి మధ్య అన్యూన్యత పెరుగుతూ వచ్చింది. ఆ చనువు తోటే మీరు మా ‘సైరా’ సినిమాలో గౌరవ ప్రదమైన పాత్ర వేయాలి అనగానే ఏ మాత్రం ఆలోచించకుండా అంగీకరించడం ఆయన స్నేహ బంధానికి, మంచి మనసుకి నిదర్శనం. దానితో పాటు ఈ క్రైసిస్ సమయంలో నేను చేస్తున్న మంచి పనులని గుర్తించడం, మేము చేసిన కరోనా సాంగ్ చాలా బాగుంది అని ప్రశంసించడం, దాని ఇన్స్పిరేషన్ తోటి మేముకూడా ఒక స్టోరీ ని రూపొందిస్తున్నాం అందులో మీరు భాగం కావాలి అన్నప్పుడు తప్పకుండా సర్ అని ఒప్పుకున్నాను. దాని ద్వారా వచ్చే ఫండ్ లో కొంత మొత్తన్ని తెలుగు సినీ కార్మికుకు కూడా కేటాయిస్తాము అని చెప్పి ఆ డబ్బుతో 1500 వందుల విలువ చేసే కోపెన్స్ ని 12000 మందికి అందివ్వడం అనేది చాలా పెద్ద సహాయం. అందుకు ఆయనకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ‘బీ ది రియల్ మెన్’ అనే ఛాలెంజ్ నడుస్తోంది దాని గురుంచి?
– ఈ కార్యక్రమాన్ని దర్శకుడు సందీప్ రెడ్డి స్టార్ట్ చేసినా..నాకు మాత్రం వెంకటేష్ సవాల్ విసిరాడు. ఈ ఛాలెంజ్ కి ముందుగానే నేను నా ఇల్లు పరిసరాల్ని నేనే శానిటైజ్ చేసుకున్నాను. ఆ రోజు మాత్రం ఇల్లు శుభ్రం చేసి, తోట పని చేసి బ్రేక్ ఫాస్ట్ గా మా అమ్మకు పెసరట్టు ఇప్మా వేసి ఇచ్చాను. స్వయంగా నేను తయారు చేసినా ఆ ఫలహారం మా అమ్మ తింటుంటే…తిరిగి నాకు నోటికి అందిస్తూనే నేను ఎంతో ఉద్వేగానికి లోనయ్యాను. ఇవి జీవితం లో మరపురాని సంఘటనలు.
పోలీసులు అందిస్తున్న సేవ చూస్తుంటే పోలీసు బిడ్డగా మీకెమనిపిస్తుంది?
– నాన్నగారు పోలీస్‌గా డ్యూటీ చేస్తున్నప్పుడు విధి నిర్వహణలో ఎలా ఉండేవారో నేను దగ్గర నుండి గమనించాను. అందువల్లనే నాకు పోలీసుల పట్ల ఎప్పుడూ గౌరవం ఉంటుంది. నా సొంత కుటుంబ సభ్యుల్లా భావిస్తుంటాను. పోలీసులకు మనం కూడా విధిగా మన వంతు సాయాన్ని అందించాలి. ఈ సందర్భంగా వారికి నా హృదయపూర్వకమైన అభినందనలు . పోలీసులతో పాటు ఇప్పుడు కనిపించే దేవుళ్ళు డాక్టర్లు, నర్సులు, ఫార్మసీ, పారిశుద్ధ కార్మికులు వాళ్ళ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఈ రోజు రోగులకు సేవలందిస్తున్నారు. ఇవన్నీ కాకుండా నిరంతరం ఈ భయంకరమైన పరిస్థితిని వున్నది వున్నట్టుగా ప్రజలకి చూపిస్తున్న మీడియా వీరందరికి నా నా హృదయపూర్వకమైన అభినందనాలు.
కరోనా సమయంలో పని లేకపోయినా రోడ్లు పైకి రావానుకుంటున్న వారికి మీరిచ్చే సహా ఏంటి?
– ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కరోనా వైరస్‌ను నియంత్రించాలంటే మనం బయటకు రాకుండా ఉండటమే ఉత్తమా మైన మార్గం. మనం ఇళ్లలో ఉండటం వల్ల వచ్చే నష్టం తక్కువే. కాబట్టి దాన్ని మనం తర్వాత పూర్తి చేసుకోవచ్చు కాబట్టి ఇప్పుడు అందరూ ఇళ్లలోనే ఉంటే మంచిది. మన ఇంట్లోని వారికి చేదోడు వాదోడుగా ఉండాలి. మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఇలాంటి పరిస్థితుల లో మనకు బయటికి రాకూడదు. కానీ ఇక్కడ చెడులో మంచిని వెతుక్కుంటే మనం బయటకు రాకపోవడం వల్ల కాలుష్యం చాలా వరకు తగ్గింది. అందరూ ఎంచక్కా కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతున్నారు. బయట ఆహారం తీసుకోకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలేవీ రావడం లేదు. కరోనా నుండి పరిస్థితి చక్కబడిన తర్వాత ఆరోగ్యం విషయంలో ఇలాంటి జాగ్రత్తను పాటిస్తే ఇంకా మంచిది. అనవసరంగా బయటకు వచ్చే వాళ్ళు ఈ విషయాన్నీ అర్ధం చేసుకోవాలి నేను బాగుండాలి మనందరం బాగుండాలనే సదుద్ధ్యేసం తో మెలగాలి.
‘ఆర్ఆర్ఆర్’లో పుట్టినరోజు నాడు చరణ్‌కు రాజమౌళి ఇచ్చిన గిఫ్ట్ చూసి ఎలా ఫీయ్యారు?
– చాలా సంతోషంగా అనిపించింది. అసలు ఇద్దరు అగ్ర కథానాయకును రాజమౌళి ఎలా బ్యాలెన్స్ చేస్తారోనని అనుకునేవాడిని. కానీ ఆయన చాలా తెలివైనవాడు ఎందుకంటే చరణ్‌ను వీడియో చూపించి, తారక్‌ను ఆడియో రూపంలో వినిపించడం ఇద్దరి అభిమానులు సంతోషపడేలా ప్రోమోను విడుదల చేశాడు. ఇది అసాదారుణం అయినా విషయం అలాగే ఇప్పుడు ఎన్టీఆర్ ప్రోమో కోసం కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. మరి రాజమౌళిగారు ఎలా ప్లాన్ చేస్తారో చూడాలి.
మీ ఆటో బయోగ్రఫీ ఎంత వరకు వచ్చింది?
– గత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ గుర్తుకు వచ్చిన విషయాలను రాసుకుంటున్నాను. అన్నింటినీ వీడియో రూపంలోకి తీసుకురావానేదే నా ఆలోచన. అలాగే బుక్ రూపంలోనూ తీసుకు రావానుకుంటున్నాను. దానికింకా రెండు, మూడేళ్ల సమయం పట్టొచ్చు. అంటూ ఇంటర్వ్యూ ముగించారు మెగాస్టార్ చిరంజీవి.













