Mega157: సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లా దూసుకెళ్తున్న అనిల్

ప్రస్తుతం చిరంజీవి(Chiranjeevi) చేతిలో రెండు సినిమాలున్నాయి. అందులో ఒకటి యంగ్ డైరెక్టర్ వశిష్ట(Vasishta)తో చేస్తున్న విశ్వంభర(Viswambhara) కాగా రెండోది సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi)తో చేస్తున్న మెగా157. ఈ రెండు సినిమాల్లో ఇప్పుడు అందరి దృష్టి మెగా157(mega157) పైనే ఉంది. దానికి కారణాలు లేకపోలేదు. అనిల్ రావిపూడి లాంటి సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ తో చిరంజీవి జత కట్టడం అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోంది.
దానికి తోడు ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతార(Nayanathara) నటిస్తోంది. రీసెంట్ గానే సెట్స్ పైకి వెళ్లిన ఈ సినిమా మొదటి షెడ్యూల్ లో చిరంజీవి, నయనతారపై కామెడీ సన్నివేశాలను అనిల్ తెరకెక్కిస్తున్నాడని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడా షెడ్యూల్ పూర్తైనట్టు తెలుస్తోంది. అంటే మెగా157 ఫస్ట్ షెడ్యూల్ పూర్తి అయిందన్నమాట.
అనుకున్న దానికంటే ఒక రోజు ముందుగానే అనిల్ ఈ షెడ్యూల్ ను పూర్తి చేశాడని సమాచారం. పక్కా ప్లానింగ్ వల్లే అనిల్ ఇలా ముందుగా షెడ్యూల్ ను పూర్తి చేశాడంటున్నారు. అంతేకాదు, ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేయడంతో పాటూ నెక్ట్స్ షెడ్యూల్ ప్లానింగ్ కూడా ఆల్రెడీ జరిగిపోయిందని, ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ కు రంగం సిద్ధం చేసే పనిలో అనిల్ బిజీగా ఉన్నాడని అంటున్నారు. చూస్తుంటే ఈ సినిమాను తన అన్ని సినిమాల కంటే వేగంగా పూర్తి చేసేలా కనిపిస్తున్నాడు. సంక్రాంతి 2026 కు ఈ మూవీ రిలీజ్ కానుంది.