VenkyTrivikram: వెంకీ తో మరోసారి జత కట్టనున్న మీనూ?

గత కొన్నేళ్లుగా టాలీవుడ్ లో ఉంటున్న విక్టరీ వెంకటేష్(venkatesh) ప్రస్తుతం సీనియర్ హీరోగా కూడా మంచి జోష్ లో ఉన్నారు. సంక్రాంతికి వస్తున్నాం(sankranthiki vasthunnam) సినిమాతో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ ను అందుకున్న వెంకీ(Venky) ఆ సినిమాతో రూ.300 కోట్లు కలెక్ట్ చేసి సీనియర్ హీరోల్లో ఆ రికార్డు సాధించిన ఏకైక హీరోగా చరిత్ర సృష్టించారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా వెంకీ కెరీర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలిచింది.
ఆ సక్సెస్ ను నిలబెట్టుకోవాలని వెంకీ తన తర్వాతి సినిమాల విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగానే కాస్త టైమ్ తీసుకుని మరీ త్రివిక్రమ్(trivikram) తో సినిమాను అనౌన్స్ చేశారు వెంకీ. త్రివిక్రమ్ రైటర్ గా ఉన్నప్పుడు వెంకీతో చేసిన సినిమాలు మంచి హిట్లవడంతో ఇప్పుడు వీరిద్దరూ కలిసి చేయనున్న మూవీపై అందరికీ మంచి అంచనాలున్నాయి.
ఇప్పటికే పూజా కార్యక్రమాలతో లాంచ్ అయిన ఈ సినిమా సెప్టెంబర్ నెలాఖరు నుంచి సెట్స్ పైకి వెళ్లనుండగా ఈ సినిమాలో వెంకీ సరసన రుక్మిణి వసంత్(rukmini vasanth) హీరోయిన్ గా నటించనుందని మొదట్లో వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో వెంకీకి జోడీగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకీ గర్ల్‌ఫ్రెండ్ గా నటించిన మీనాక్షి చౌదరి(meenakshi chaudhary)ని తీసుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. మీనాక్షితో పాటూ శ్రీనిధి శెట్టి(sreenidhi Shetty), నేహా శెట్టి(neha Shetty), శ్రద్ధా శ్రీనాధ్(shraddha Srinath) పేర్లను కూడా మేకర్స్ పరిశీలిస్తున్నట్టు సమాచారం.