బాలయ్య పక్కన ఆమె సూటవుతుందా?
ఇచట వాహనములు నిలుపరాదు సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన మీనాక్షి చౌదరి, తర్వాత ఖిలాడీ సినిమా చేసింది. మొదటి రెండు సినిమాలు డిజాస్టర్లయినా అమ్మడికి టైమ్ కలిసొచ్చి హిట్2 లో ఛాన్సొచ్చింది. దాని తర్వాత కొంచెం గ్యాప్ వచ్చినప్పటికీ ఇప్పుడు మీనాక్షికి వరుస అవకాశాలొస్తున్నాయి.
మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారంలో సెకండ్ హీరోయిన్ గా మీనాక్షికి ఎప్పుడైతే ఛాన్స్ వచ్చిందో అప్పటి నుంచి అమ్మడు గ్లామర్ షో కూడా చేయడం మొదలుపెట్టింది. తమిళంలో మీనాక్షి నటించిన కొలై మూవీ ఫ్లాప్ అయినా ఆమెకు ఏకంగా దళపతి విజయ్ సినిమాలో ఛాన్స్ వచ్చిందంటే అమ్మడి లక్ ఏ రేంజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు మీనాక్షికి మరో కొత్త ఛాన్స్ వచ్చిందని వార్తలొస్తున్నాయి. బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ చేయబోయే సినిమాలో మీనాక్షిని హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తల్లో నిజమెంతున్నది పక్కన పెడితే అసలు బాలయ్య పక్కన మీనాక్షి సూటవుతుందా అనే అనుమానాలు ఎక్కువయ్యాయి. చూడ్డానికి సన్నగా, చిన్న పిల్లలా కనిపించే మీనాక్షి, బాలయ్య లాంటి మాస్ హీరో పక్కన నటిస్తే అది ఆమె కెరీర్‌కు మైనస్ అయ్యే అవకాశాలెక్కువున్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.













