మరో బంపరాఫర్ కొట్టేసిన మీనాక్షి
గుంటూరు కారం సినిమా నుంచి పూజా హెగ్డే తప్పుకోవడంతో ఆ సినిమాలో మీనాక్షి చౌదరికి ఛాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అమ్మడి దశ తిరిగిపోయి, వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. వరుణ్, విశ్వక్ సరసన నటిస్తున్న మీనాక్షికి తాజాగా కోలీవుడ్ నుంచి విజయ్68లో ఆఫర్ వచ్చినట్లు చెన్నై మీడియా వర్గాలు చెప్తున్నాయి.
ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లుండగా, ఓ హీరోయిన్ గా ప్రియాంక అరుళ్ మోహన్, మరో హీరోయిన్ గా మీనాక్షిని ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ వార్త నిజమైతే మాత్రం మీనాక్షి నిజంగా జాక్ పాట్ కొట్టినట్లే. కొన్నాళ్ల క్రితం రిలీజైన హత్య సినిమాలో మీనాక్షి కనిపించింది. ఆ సినిమా డిజాస్టర్ కావడంతో ఇక అమ్మడికి అవకాశాలు రావేమో అనుకుంటున్న టైమ్ లో విజయ్ మూవీలో ఛాన్స్ రావడమంటే లక్ అనే చెప్పాలి.
ఏదేమైనా సినీ ఇండస్ట్రీలోని హీరోయిన్ల కొరత మీనాక్షి లాంటి వారికి వరంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. గుంటూరు కారం, విజయ్ సినిమాలు రిలీజ్ అయ్యాక అమ్మడి రేంజ్ మరింత పెరగడం ఖాయం. వెంకట్ ప్రభు దర్శకత్వంలో విజయ్ డ్యూయల్ రోల్ చేస్తున్న ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి.













