Meenakshi Chaudhary: విక్రమ్ సినిమాకు మీనాక్షి గ్రీన్ సిగ్నల్?

ప్రస్తుతం మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) టాలీవుడ్ లో సక్సస్‌ఫుల్ హీరోయిన్ గా దూసుకెళ్తుంది. గతేడాది దుల్కర్ సల్మాన్(Dulquer Salman) లక్కీ భాస్కర్(Lucky Bhaskar) తో సూపర్ హిట్ కొట్టిన మీనాక్షి చౌదరి, ఈ సంవత్సరం సంక్రాంతికి వస్తున్నాం(sankranthiki Vasthunnam) సినిమాతో బ్లాక్ బస్టర్ ను అందుకుంది. ఈ రెండు సినిమాల సక్సెస్ తర్వాత మీనాక్షి క్రేజ్ బాగా పెరిగింది. ప్రస్తుతం నాగ చైతన్య(Naga Chaitanya)తో కలిసి NC24 సినిమాలో నటిస్తోంది మీనాక్షి.
దాంతో పాటూ నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty) హీరోగా తెరకెక్కుతున్న అనగనగా ఒక రాజు(Anagana Oka Raju) అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో కూడా మీనాక్షి హీరోయిన్ గా నటిస్తుంది. ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా మీనాక్షి ఓ తమిళ స్టార్ హీరో సినిమాలో నటిస్తుందనే విషయంలో వార్తల్లో నిలుస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం మీనాక్షి ఇప్పుడా సినిమాకు సైన్ చేసిందని తెలుస్తోంది.
కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్(Vikram) హీరోగా మండేలా అండ్ మావీరన్ ఫేమ్ మడోన్ అశ్విన్(Madonnw Ashwin) దర్శకత్వంలో విక్రమ్ తన 63వ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. విక్రమ్63(Vikram63) వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా మరికొన్ని వారాల్లో సెట్స్ పైకి వెళ్లనుండగా, ఆ సినిమాలో హీరోయిన్ గా మీనాక్షి నటించనుందని, రీసెంట్ గానే మీనాక్షి ఆ సినిమాకు సైన్ చేసిందని సమాచారం. కానీ ఈ సినిమాలో మీనాక్షి నటిస్తుందనే విషయంలో ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.