శ్రీలీల వెనక్కి.. మీనాక్షి ముందుకి
మొన్నటివరకు టాలీవుడ్ లో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది శ్రీలీల. భగవంత్ కేసరి తప్ప గతేడాది మూడు డిజాస్టర్లు అందుకున్న శ్రీలీలకు గుంటూరు కారం ఓ మోస్తరు రిలీఫ్ ను ఇచ్చింది. గుంటూరు కారం కు కలెక్షన్స్ బాగా వచ్చినప్పటికీ అది బ్లాక్ బస్టర్ అని చెప్పలేం. ప్రస్తుతం ఎంబీబీఎస్ ఎగ్జామ్స్ కోసం గ్యాప్ తీసుకున్న శ్రీలీల చేతిలో ఉస్తాద్ భగత్ సింగ్ తప్ప మరో సినిమా లేదు.
ఇదిలా ఉంటే శ్రీలీలతో పాటూ కలిసి గుంటూరు కారంలో నటించిన మీనాక్షి చౌదరి మాత్రం క్రమంగా తన స్పీడు పెంచుకుంటూ వెళ్తుంది. ఇప్పటికే తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ సరసన గోట్ లో ఛాన్స్ కొట్టేసిన మీనాక్షికి ఆ సినిమా హిట్ అయితే మాత్రం తమిళంలో ఆఫర్లు క్యూ కట్టడం ఖాయం. దీంతో పాటూ వరుణ్ తేజ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా మట్కాలోనూ నటిస్తోంది.
దుల్కర్ సల్మాన్ సరసన లక్కీ భాస్కర్ లో చేస్తున్న మీనాక్షికి ఆ సినిమాలో నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర దక్కిందని సమాచారం. విశ్వక్సేన్ కు జోడీగా మెకానిక్ రాకీ సినిమాలో కూడా మీనాక్షినే హీరోయిన్. మొత్తం నాలుగు సినిమాలు మీనాక్షి చేతిలో ఉన్నాయి. మొన్నటివరకు చిన్న సినిమాల్లో హీరోయిన్ గా నటించిన మీనాక్షి, ఇప్పుడు మెయిన్ హీరోయిన్ గా స్టార్ల సరసన నటిస్తుందంటే అమ్మడి డిమాండ్ ఎంత పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.













