బాలయ్యకు ఆ మాస్ టైటిల్ను ఫిక్స్ చేశారా?
బాలకృష్ణ(Bala krishna)- బాబీ(Bobby) కలయికలో రూపొందుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్(Sithara Entertainments) బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. తాజాగా ఈ సినిమాను టైటిల్ ను అనౌన్స్ చేయడానికి మేకర్స్ రెడీ అయ్యారు. దీపావళి సందర్భంగా ఈ సినిమా టైటిల్ తో పాటూ టీజర్ ను కూడా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.
అంతర్గత సమాచారం ప్రకారం ఈ సినిమాకు మాస్ టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. కథకు తగ్గట్టు ఉండాలని ఈ సినిమాకు సర్కార్ సీతారాం(sarkar sitaram) అనే టైటిల్ ను లాక్ చేశారట. బాలయ్య ఇమేజ్, క్రేజ్ ను దృష్టిలో ఉంచుకుని ఎన్నో రకాల టైటిల్స్ ను అనుకున్నప్పటికీ చివరకు ఈ టైటిల్నే ఫిక్స్ చేసినట్లు సమాచారం.
ఈ సినిమాలో బాలయ్య పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండనుందని సమాచారం. రాజస్తాన్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో బాలయ్య క్యారెక్టర్ మాస్ ఆడియన్స్ కు ఓ విభిన్న అనుభూతిని పంచుతుందని యూనిట్ సభ్యులు చెప్తున్నారు. బాబీ డియోల్(Bobby deol) విలన్ గా నటించనున్న ఈ సినిమాకు తమన్(thaman) సంగీతం అందిస్తున్నాడు. షూటింగ్ పూర్తవగానే ప్రమోషన్స్ పై చిత్ర యూనిట్ దృష్టి సారించనుంది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.













