Mass Jathara: మాస్ జాతర కొత్త రిలీజ్ డేట్ అదేనా?

మాస్ మహారాజ్(Ravi Teja) కు ధమాకా(Dhamaka) సినిమా తర్వాత సాలిడ్ సక్సెస్ దక్కలేదు. ధమాకా తర్వాత రవితేజ ఎన్నో సినిమాలు చేసినప్పటికీ అవన్నీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాయి. దీంతో ఈసారి ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు రవితేజ. అందులో భాగంగానే మరోసారి ధమాకా భామ శ్రీలీల(Sree Leela)తో కలిసి సినిమా చేస్తున్నాడు.
భాను భోగవరపు(Bhanu Bhogavarapu) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకుని ఆగస్ట్ 27న రిలీజ్ కానున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేశారు. కానీ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నప్పటికీ మేకర్స్ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ ను మొదలుపెట్టకపోవడంతో సినిమా వాయిదా పడిందని అందరూ భావిస్తున్నారు. అయితే మాస్ జాతర రిలీజ్ డేట్ కు సంబంధించి ఇప్పుడో అప్డేట్ వినిపిస్తోంది.
ఆగస్ట్ 27 నుంచి వాయిదా పడి మాస్ జాతర సినిమా వచ్చే నెల అంటే సెప్టెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతుందని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రానున్నట్టు సమాచారం. సితార ఎంటర్టైన్మెంట్స్(Sithara Entertainments), ఫార్చూన్ ఫోర్ సినిమాస్(Fortune Four Cinemas) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో(Bheems Ciciroleo) సంగీతం అందిస్తున్నాడు.