Mass Jathara: మరోసారి వెనక్కి వెళ్లనున్న మాస్ జాతర
మాస్ మహారాజా రవితేజ(Raviteja) హీరోగా శ్రీలీల(Sree Leela) హీరోయిన్ గా తెరకెక్కుతున్న సినిమా మాస్ జాతర(Mass Jathara). ధమాకా(Dhamaka) తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. భాను భోగవరపు(Bhanu Bhogavarapu) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఆగస్ట్ 27న రిలీజ్ కానుంది.
అంటే రిలీజ్ డేట్ కు పట్టుమని మరో నెల రోజులు కూడా తేడా లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడో అప్డేట్ వినిపిస్తోంది. వాస్తవానికి ఈ సినిమా మే 9న రిలీజ్ అవాల్సింది కానీ అది ఆగస్ట్ 27కు వాయిదా పడింది. అయితే ఇప్పుడు మరోసారి కూడా ఈ రిలీజ్ డేట్ మారుతుందని తెలుస్తోంది. ఆగస్ట్ నుంచి పోస్ట్‌పోన్ చేసి దసరా బరిలో నిలపాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట.
దీన్ని బట్టి చూస్తుంటే దసరా అంటే అక్టోబర్ మొదటి వారంలో మాస్ జాతర రిలీజయ్యే ఛాన్సుందని రూమర్లు వినిపిస్తున్నాయి. కానీ దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. సితార ఎంటర్టైన్మెంట్స్(Sithara Entertainments) మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్(Fortune Four Cinemas) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో(Bheems Ciciroleo) సంగీతం అందిస్తుండగా త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది.













