Maruthi: మారుతి నెక్ట్స్ ఆ హీరోతో?
టాలీవుడ్ డైరెక్టర్ మారుతి(Maruthi) ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(prabhas) హీరోగా ది రాజా సాబ్(the raja saab) సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. హార్రర్ కామెడీ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా వాస్తవానికి ఎప్పుడో రిలీజవాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల షూటింగ్ లేటవడంతో సినిమా రిలీజ్ ఆలస్యమైంది. డిసెంబర్ 5న రాజా సాబ్ ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు.
రాజా సాబ్ సినిమాను లైన్ లో పెట్టిన తర్వాత డైరెక్టర్ గా మారుతి క్రేజ్ బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో మారుతి రాజా సాబ్ తర్వాత ఏ హీరోతో సినిమా చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పుడు ఈ విషయంలో ఓ వార్త వినిపిస్తోంది. మారుతి తన తర్వాతి సినిమాను ఓ మెగా హీరోతో చేయబోతున్నాడనే టాక్స్ టాలీవుడ్ సర్కిల్స్ లో జోరుగా వినిపిస్తున్నాయి.
ఆల్రెడీ గతంలో మెగా హీరోలైన అల్లు శిరీష్(allu sirish), సాయి ధరమ్ తేజ్(sai dharam tej) తో సినిమాలు చేసిన మారుతి ఇప్పుడు మరోసారి సాయి ధరమ్ తేజ్ తో ఓ సినిమా చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది. సాయి ధరమ్ తేజ్ తో మారుతి చేయబోయే సినిమాకు అతను డైరెక్టర్ కాదట. మారుతి- తేజ్ తో చేయబోయే సినిమాకు కేవలం నిర్మాతగా మాత్రమే వ్యవహరించనున్నారని, ఈ సినిమాకు టైగర్ నాగేశ్వరరావు(tiger nageswara rao) డైరెక్టర్ వంశీ(Vamsi) దర్శకత్వం వహించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆ ప్రాజెక్టుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తైందని, త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు.







