Manoj Bajpayee: ఫ్యామిలీ మ్యాన్3 రిలీజ్ డేట్ పై అప్డేట్ ఇచ్చిన మనోజ్ భాజ్‌పాయ్

ఇండియన్ ఓటీటీలో వచ్చిన బాగా పాపులరైన సిరీసుల్లో ది ఫ్యామిలీ మ్యాన్(The Family Man) కూడా ఒకటి. ప్రైమ్ వీడియో(Prime Video)లో వచ్చిన బెస్ట్ థ్రిల్లర్ వెబ్ సిరీసుల్లో ఫ్యామిలీ మ్యాన్ కూడా ఒకటి. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ సిరీస్ మూడో సీజన్ కు రెడీ అవుతుంది. రాజ్ అండ్ డీకే(Raj &Dk) మూడో సీజన్ ను మరింత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండగా ఫ్యామిలీ మ్యాన్3(Family Man3) కోసం అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లో ప్రధాన పాత్రలో నటిస్తున్న మనోజ్ భాజ్‌పాయ్(manoj Bajpayee) సీజన్3 రిలీజ్ గురించి ఓ కీలక అప్డేట్ ఇచ్చారు. ఆల్రెడీ సీజన్3 షూటింగ్ పూర్తైందని, అక్టోబర్ లాస్ట్ వీక్ లేదా నవంబర్ ఫస్ట్ వీక్ లో ఫ్యామిలీ మ్యాన్3 స్ట్రీమింగ్ మొదలవుతుందని, ఫ్యామిలీ మ్యాన్ ను స్టార్ట్ చేసినప్పుడు అదింత దూరం వెళ్తుందనుకోలేదని ఆయన చెప్పాడు.
తాను కిల్లర్ సూప్(Killer Soup) లాంటి బ్లాక్ బస్టర్ సిరీస్ ల్లో నటించినా ఫ్యామిలీ మ్యాన్ కు వచ్చిన ఆదరణ దేనికీ రాలేదని ఆయన చెప్పాడు. ఫ్యామిలీ మ్యాన్ సీజన్3 అందరి అంచనాలను మించి ఉంటుందని, మొదటి రెండు సిరీస్‌లు చూసిన వారిని ఈ సీజన్ ఎక్కడా నిరాశ పరచదని, ఈ సీజన్ లో జైదీప్ అహ్లావత్(Jaideep Ahlawat) కీలక పాత్ర చేశారని, ఆయనే సీజన్3 మొత్తాన్ని నడిపిస్తారని, ఆయనతో కలిసి వర్క్ చేయడం ఎంతో ఆనందాన్నిచ్చిందని మనోజ్ బాజ్‌పాయ్ తెలిపాడు.