25న మన్మథుడు ట్రైలర్
నాగార్జున కథానాయకుడిగా నటించిన చిత్రం మన్మథుడు 2. రకుల్‌ప్రీత్ సింగ్ కథానాయిక. రాహుల్ రవీంద్రన్ దర్శకుడు. సమంత అతిధి పాత్రలో కనిపించనున్నారు. మనం ఎంటర్ప్రైజెస్, వయకామ్ 18 స్టూడియోస్ సంస్థలు నిర్మించాయి. నాగార్జున, పి.కిరణ్ నిర్మాతలు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈనెల 25న ట్రైలర్‌ని విడుదల చేస్తున్నారు. ఆగస్టు 9న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. కుటుంబ బంధాలకు, వినోదానికీ పెద్ద పీట వేసిన చిత్రమిది. నాగార్జున పాత్రని తీర్చిదిద్దిన విధానం అందరికీ నచ్చుతుంది. టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. ట్రైలర్ కూడా తప్పకుండా ఆకట్టుకుంటుదని చిత్ర బృందం తెలిపింది. లక్ష్మి, వెన్నెల కిషోర్, రావు రమేష్, ఝాన్సీ, దేవదర్శిని తదితరులు నటించారు. సంగీతం చైతన్య భరద్వాజ్.













