పోర్చుగల్ లో మన్మథుడు 2
అక్కినేని నాగార్జున, రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా నటిస్తోనన చిత్రం మన్మథుడు 2. మనం ఎంటర్ ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ పతాకాలపై రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున అక్కినేని, పి.కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ పోర్చుగల్‌లో జరుగుతుంది. చిత్రీకరణ సమయంలో నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెల కిషోర్ ఉన్న కొన్ని ఫొటోలను విడుదల చేశారు. అలాగే నాగార్జున, రకుల్‌ప్రీత్ సింగ్, వర్కవుట్ చేస్తోన్న వీడియోను రీసెంట్గా విడుదల చేశారు. నాగార్జున, రకుల్‌ప్రీత్ సింగ్ జోడీ బావుంది. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ఎం.సుకుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తోనన్నారు.













