Maniratnam: మణిరత్నం నెక్ట్స్ పాన్ ఇండియా కాదట
సౌత్ లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం(Maniratnam) దర్శకత్వంలో ఆఖరిగా వచ్చిన సినిమా థగ్ లైఫ్(Thug Life). కమల్ హాసన్(Kamal Haasan) హీరోగా తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాలతో రిలీజై బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. దీంతో థగ్ లైఫ్ తర్వాత మణిరత్నం ఎవరితో సినిమా చేస్తాడా అనేది అందరికీ ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో పలువురి పేర్లు కూడా వినిపించాయి.
తాజా సమాచారం ప్రకారం మణిరత్నం తన తర్వాతి సినిమాను విక్రమ్(Vikram) కొడుకు ధృవ్ విక్రమ్(Dhruv Vikram) తో చేయనున్నట్టు తెలుస్తోంది. చెన్నైలోని ఓ పోలీస్ అధికారికి, సిటీ అమ్మాయికీ మధ్య జరిగే లవ్ స్టోరీగా మణిరత్నం ఈ సినిమాను తీయనున్నారట. అంతేకాదు ఈ మూవీని మణిరత్నం పాన్ ఇండియా స్థాయిలో కాకుండా కేవలం తమిళంలోనే తీస్తున్నారట.
సెప్టెంబర్ నుంచి సినిమాను మొదలుపెట్టి, కేవలం 60 రోజుల్లోనే సినిమాను పూర్తి చేసి, 2026 ఫిబ్రవరికి సినిమాను రెడీ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. ఏఆర్ రెహమాన్(AR Rahman) సంగీతం అందించనున్న ఈ సినిమాకు రవి కె. చంద్రన్(Ravi K Chandran) సినిమాటోగ్రఫీ చేయనుండగా, రుక్మిణి వసంత్(Rukmini Vasanth) ఈ సినిమాలో ధృవ్ విక్రమ్ సరసన నటించనుందట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే వీలుంది.







