Manchu Vishnu: అమితాబ్ ను డైరెక్ట్ చేయాలనుంది

మంచు విష్ణు(manchu vishnu) సక్సెస్ అందుకుని చాలా కాలమవుతుంది. మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన కన్నప్ప(kannappa) సినిమా రిలీజ్ కు రెడీ అయింది. జూన్ 27న కన్నప్ప ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఆ సినిమా విజయం పై విష్ణు ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కన్నప్ప తన డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కిందని చెప్తోన్న విష్ణు ఆ చిత్ర ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటూ పలు విషయాల గురించి మాట్లాడుతున్నారు.
తాజాగా ఇంటర్వ్యూలో భాగంగా విష్ణుకు ఓ క్రేజీ క్వశ్చన్ ఎదురైంది. భవిష్యత్తులో మీరు డైరెక్షన్ వైపు వెళ్తారా అని అడగ్గా ఆ ప్రశ్నకు విష్ణు సమాధానమిచ్చారు. ఒకవేళ తాను దర్శకత్వ బాధ్యతలు చేపడితే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్(Amithab bachan) ను దర్శకత్వం వహించాలనుకుంటున్నట్టు తన మనసులోని కోరికను బయటపెట్టారు మంచు విష్ణు.
అమితాబ్ ను డైరెక్ట్ చేయడం తన చిన్నప్పటి కోరిక అని, ఇండియా మొత్తం ఆయన నటనను ఎంతో ఇష్టపడుతుందని, కల్కి(Kalki) సినిమాలో అతని నటన ఎంతో అద్భుతంగా ఉందని, ఆ పాత్ర తనకెంతో నచ్చిందని చెప్పారు విష్ణు. ప్రస్తుతం విష్ణు చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక కన్నప్ప విషయానికొస్తే ముకేష్ కుమార్ సింగ్(Mukesh kumar singh) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ నటించడంతో, సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.