Manchu Vishnu: పహల్గామ్ బాధిత కుటుంబాన్ని దత్తత తీసుకున్న మంచు విష్ణు
తెలుగు సినిమా హీరో, నిర్మాత మంచు విష్ణు(Manchu Vishnu) రీసెంట్ గా ఏపీలోని పహల్గామ్ బాధితుడి కుటుంబాన్ని దత్తత తీసుకుని తన ఉదార హృదయాన్ని చాటుకున్నాడు. నెల్లూరు జిల్లా కావలిలోని కుమ్మరి వీధికి చెందిన సోమిశెట్టి మధుసూధన్ రావు(Somisetti Madhu sudhan Rao) కొన్నాళ్ల కిందట పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయాడు.
పహల్గామ్ లో ఉగ్రదాడిలో చనిపోయిన 26 మంది టూరిస్టుల్లో మధుసూధన్ కూడా ఒకరు. ఇటీవల విష్ణు, మధుసూధన్ భార్య కామాక్షి, అతని కుటుంబాన్ని కలిసి వారు మధు మృతి పట్ల సంతాపం తెలపడంతో పాటూ కష్టకాలంలో ఉన్న అతని కుటుంబానికి అండగా ఉంటానని, మధు పిల్లల్ని దత్తత తీసుకుంటానని హామీ ఇచ్చాడు.
మంచు విష్ణు తీసుకున్న ఈ నిర్ణయానికి అతన్ని అందరూ మెచ్చుకుంటూ అభినందిస్తున్నారు. ప్రస్తుతం కన్నప్ప(Kannappa) సినిమా పోస్ట్ ప్రొడక్షన్ తో బిజీగా ఉన్న మంచు విష్ణు ఆ సినిమాను జూన్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. ముకేష్ కుమార్ సింగ్(Mukesh Kumar Singh) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మోహన్ బాబు(Mohan Babu) నిర్మించగా ఈ సినిమాలో ప్రభాస్(Prabhas), అక్షయ్ కుమార్(Akshay Kumar), కాజల్(Kajal), మోహన్ లాల్(Mohan Lal) కీలక పాత్రల్లో కనిపించనున్నారు.






