Manasa Choudhary: చీరందంలో మరింత అలరిస్తోన్న మానస
రోషన్ కనకాల(Roshan Kanakala) హీరోగా వచ్చిన బబుల్గం(Bubblegum) సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన తెలుగమ్మాయి మానస చౌదరి(manasa Choudhary) సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫాలోయింగ్ ను పెంచుకుంటూ ఉంటుంది. అందులో భాగంగానే ఎప్పటికప్పుడు తన ఫోటోలను నెట్టింట షేర్ చేస్తూ ఉంటుంది మానస. తాజాగా అమ్మడు చీరకట్టులో దర్శనమిచ్చి తన అందాలతో ఫాలోవర్లను బాగా ఆకట్టుకుంది. ఈ ఫోటోల్లో మానస పర్పుల్ కలర్ శారీ ధరించి, జుట్టును గాలికి వదిలేసి తన లుక్ ను ఎంతో స్టైలిష్ గా మార్చగా, చీరకట్టులో మానస ఎంతో క్యూట్ గా ఉందని కామెంట్స్ చేస్తూ నెటిజన్లు ఆ ఫోటోలను వైరల్ చేస్తున్నారు.







