Devara2: దేవర2 కథలో భారీ మార్పులు?

ఆర్ఆర్ఆర్(RRR) తర్వాత ఎన్టీఆర్(NTR) హీరోగా వచ్చిన సినిమా దేవర(Devara). అరవింద సమేత(aravinda sametha) తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా తెరకెక్కిన సినిమా కావడంతో దేవరపై ముందు నుంచే భారీ హైప్ నెలకొంది. దానికి తోడు ఎన్టీఆర్- కొరటాల శివ(koratala siva) కాంబినేషన్ లో గతంలో వచ్చిన జనతా గ్యారేజ్(janatha garrage) మంచి హిట్ గా నిలవడంతో దేవరపై కూడా అంచనాలు పెట్టుకున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.
భారీ అంచనాల నడుమ రిలీజైన దేవర సినిమాకు ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ తో పాటూ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు కూడా వచ్చాయి. థియేటర్లలోనే కాకుండా ఓటీటీలో కూడా దేవరకు మంచి ఆదరణ లభించింది. అందుకే ఈ సినిమాకు సీక్వెల్ గా రానున్న దేవర2(devara2) పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇంకా చెప్పాలంటే దేవర2 లోనే సినిమాకు సంబంధించిన కథంతా ఉంది.
ఇదిలా ఉంటే దేవర2 గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. దేవర2 కథలో కొరటాల చాలా మార్పుల చేశారని, నార్త్ ఆడియన్స్ ను ఇంప్రెస్ చేయడానికి కొంత స్పెషల్ కేర్ కూడా తీసుకున్నారని, అందులో భాగంగానే ఈ మూవీలో మరో బాలీవుడ్ హీరోను కూడా భాగం చేయనున్నారని తెలుస్తోంది. అంతేకాదు, జాన్వీ కపూర్(janhvi kapoor) కాకుండా ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా నటించనుందని అంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంతన్నది తెలియాల్సి ఉంది.