Thaman: తమన్ ను బాధ పెట్టిన మహేష్ ఫ్యాన్స్

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లలో తమన్(Thaman) కూడా ఒకరు. ఏదైనా స్టార్ల నుంచి పెద్ద సినిమా అనౌన్స్ అవుతుందనుకుంటే అందరూ తమన్ ను కూడా అందులో భాగం చేయాలని ఆలోచిస్తుంటారు. వరుస అవకాశాలతో ప్రతీ సినిమాతో డిఫరెంట్ ఆల్బమ్ ను ఆడియన్స్ కు అందిస్తున్న తమన్ పై కాపీ విమర్శలు కూడా ఎక్కువగా వినిపిస్తాయి.
అందుకే తమన్ నుంచి ఏదైనా కొత్త ట్యూన్ రావడం ఆలస్యం, దాన్ని తమన్ ఎక్కడ్నుంచి కాపీ చేశాడా అని నెటిజన్లు అదే పనిగా వెతుకుతుంటారు. అయితే ఈ విమర్శలు మితిమీరడంతో అవి తమన్ ను కూడా చాలా ఇబ్బంది పెడుతున్నాయి. ఆడియన్స్ నుంచి వచ్చే విమర్శల వల్ల తాను చాలా తీవ్ర మనస్తాపానికి గురైనట్టు తమన్ రీసెంట్ గా వెల్లడించాడు.
గుంటూరు కారం(gunturu karam) సినిమాకు తమన్(thaman) మ్యూజిక్ అనగానే తనను వద్దంటూ ఎంతోమంది మహేష్ ఫ్యాన్స్ నెట్టింట ట్రెండ్ స్టార్ట్ చేశారని, ఈ విషయంపై ఏకంగా 67.1 వేల పోస్టులు చేశారని, వాటిని చూసి తాను చాలా బాధ పడ్డానని, ఇప్పటికీ ఆ విషయంలో బాధగా అనిపిస్తూ ఉంటుందని, మహేష్(Mahesh Babu) కు తానెప్పుడూ మంచి ఆల్బమ్సే ఇచ్చినప్పటికీ అతని ఫ్యాన్స్ తనపై వ్యతిరేకత కలిగి ఉండటం తనను బాధించిందని తమన్ చెప్పుకొచ్చాడు.