భారీ ఖర్చుతో మహేష్ కొత్త కార్వాన్
సూపర్ స్టార్ మహేష్ బాబుకు దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు బ్రాండ్ ఎండార్స్మెంట్స్ తో సంపాదిస్తుంటారు. టాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోలలో ఒకరైన మహేష్.. దానికి తగ్గట్టే విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంటారు. తాజాగా మహేష్ బాబు తన రేంజ్ కు తగ్గట్లుగా అత్యాధునిక కార్వాన్ ను రెడీ చేయించుకున్నట్లు తెలుస్తోంది. దీని కోసం ముంబైకి చెందిన ఓ ఇంటీరియర్ డిజైనర్ మహేష్ అభిరుచికి తగ్గట్టుగా అద్భుతంగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.
ఇప్పుడు తాజాగా మహేష్ బాబు తన రేంజ్ కు సరిపోయే నూతన టెక్నాలజీతో ఒక కార్వాన్ ను రెడీ చేయించుకున్నారు. ముంబైలోని ఇంటీరియర్ డిజైనర్ మహేష్ టేస్ట్ కు తగ్గట్లు దీనిని ఎంతో అద్భుతంగా డిజైన్ చేశాడట. ఈ కార్వాన్ కోసం మహేష్ బాగానే ఖర్చు చేశాడని ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఆ కార్వాన్ కు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మహేష్ లక్కీ నంబర్ 4005 తోనే ఈ కార్వాన్ ను కూడా రిజిస్టర్ చేయించడం గమనార్హం. మహేష్ వెహికల్స్ నెంబర్లనీ 4005 తోనే ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో చేస్తున్న సూపర్ స్టార్ రీసెంట్ గగానే దుబాయ్ షెడ్యూల్ పూర్తి చేసుకుని ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారు. 2022 సంక్రాంతి కానుకగా సర్కారు వారి పాట ప్రేక్షకుల ముందుకు రానుంది.













