ఏఎంబీ లో మహేశ్ బాబు మైనపు విగ్రహం ఆవిష్కరణ
గచ్చిబౌలిలోని ఏఎంబీ సినిమాస్ మల్టిప్లెక్స్‌లో మహేశ్ బాబు మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. సినీ ఇండస్ట్రీలో మహేశ్‌కు ఉన్న పాపులారిటీ గుర్తించిన మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం నిర్వహకులు సూపర్ స్టార్ మైనపు విగ్రహాన్ని తయారు చేసింది. అయితే మహేశ్ అభిమానుల కోసం ఈ మైనపు విగ్రహాన్ని ముందుగా నగరంలోని ఏఎంబీ సినిమాస్‌లో ఆవిష్కరించారు. తర్వాత సింగపూర్ మ్యూజియంలో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు అభిమానులు ఈ మైనపు బొమ్మతో సెల్ఫీ దిగే అవకాశం కల్పించారు. ఇలాంటి కార్యక్రమం తర్వాత విగ్రహాన్ని తరలించడం మేడమ్ టుస్సాడ్స్ చరిత్రలోనే మొదటిసారి కావడం విశేషం. బ్లాక్ సూట్లో మహేశ్ మైనపు బొమ్మ ఆకట్టుకుంటోంది. రేపు ఉదయమే మళ్లీ దీనిని సింగపూర్‌కు తరలించే ఏర్పాట్లు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో మహేశ్ బాబుతో పాటు ఆయన కుటుంబసభ్యులు, మ్యూజియం ప్రతినిధులు, సన్నిహితులు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.













