బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న మహేశ్ బాబు
సినీ నటుడు మహేశ్ బాబు, దర్శకుడు కొరటాల శివ బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్ తెరకెక్కిన భరత్ అనే నేను చిత్రం ఘన విజయం కావడంతో వారు విజయవాడకు వచ్చారు. వారితో పాటు మహేశ్ బావ, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కూడా కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. మహేష్ బాబు ఆలయానికి వెళుతున్న సమయంలో అభిమానులు భారీగా అక్కడికి చేరుకున్నారు. దర్శనం అనంతరం చిత్ర యూనిట్ గవర్నర్ పేటలోని అన్నపూర్ణ ధియేటర్‌కు వెళ్లారు. దీంతో థియేటర్ దగ్గరకు ఫ్యాన్స్ భారీగా చేరుకున్నారు. ట్రెండ్‌సెట్ మాల్లో నిర్వహించే విజయోత్సవ వేడుకల్లో వీరు పాల్గొననున్నారు. ఇక్కడే మహేశ్ అభిమానులతో భరత్ అనే నేను సినిమా చూస్తారు.













