బుర్రిపాలెం గ్రామ ప్రజలకు వ్యాక్సిన్, వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేసిన మహేశ్ బాబు

సెకండ్ వేవ్‌లో కరోనా దేశంలో విశృంఖలంగా వ్యాపిస్తోంది. ఈ కష్టకాలంలో సెలబ్రిటీలు ప్రజలకు అండగా నిలుస్తున్నారు. అవసరంలో ఉన్నవారి గురించి సమాచారం తెలుసుకొని వారికి తగిన సాయం అందిస్తున్నారు. తాజాగా ప్రజలకు సహాయం అందించేందుకు సూపర్‌స్టార్ మహేశ్ బాబు ముందుకు వచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి దారుణంగా ఉంది. మొదటి దశతో పోల్చితే రెండో దశ కరోనా తాకిడి అత్యంత ప్రమాదకరంగా కనిపిస్తోంది. సరైన వైద్యసౌకర్యాలు అందక ప్రజలు నానా ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రజలకు సహాయం అందించేందుకు సెలబ్రిటీలు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు. కొందరు కరోనా బాధితుల సహాయం కోసం ఆర్థిక సహాయం అందిస్తుండగా.. మరికొందరు వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేశారు. కొద్ది రోజుల క్రితం నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. తన నియోజకవర్గం హిందూపురంకి రూ.25 లక్షల విలువైన కరోనా కిట్లు పంపించిన విషయం తెలిసిందే.
తాజాగా కరోనా బాధితులకు సహాయం అందించేందుకు సూపర్‌స్టార్ మహేశ్ బాబు ముందుకు వచ్చారు. కోవిడ్ వ్యాప్తి ప్రారంభం అయినప్పటి నుంచి సోషల్‌మీడియా వేదికగా ఆయన ప్రజలకు అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. తాజాగా తను దత్తతు తీసుకున్న బుర్రిపాలెం గ్రామ ప్రజలకు ఆయన మరోసారి అండగా నిలిచారు. అక్కడివారికి వైద్య సౌకర్యాలతో పాటు కరోనా వ్యాక్సిన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంపై మహేశ్ బాబు అక్కడి స్థానిక అధికారులతో చర్చలు జరిపినట్లు సమాచారం.