Puri Sethupathi: పూరీ సేతుపతి సినిమాకు మహతి మ్యూజిక్
వరుస ఫ్లాపుల్లో ఉన్న పూరీ జగన్నాథ్(puri Jagannadh) హిట్ అందుకుని చాలా కాలమే అవుతుంది. ఆయన ఆఖరిగా హిట్ అందుకుంది ఇస్మార్ట్ శంకర్(ismart Shankar) సినిమాతో. ఆ సినిమా తర్వాత లైగర్(Liger), డబుల్ ఇస్మార్ట్(Double Ismart) సినిమాలు చేసినప్పటికీ అవి డిజాస్టర్లుగా మారాయి. దీంతో పూరీకి తర్వాత సినిమా కోసం ఎవరు ఛాన్స్ ఇస్తారా అని అంతా అనుకున్నారు.
కానీ పూరీ మాత్రం అందరికీ షాకిస్తూ తన తర్వాతి సినిమాను కోలీవుడ్ యాక్టర్ విజయ్ సేతుపతి(Vijay Sethupathi)తో అనౌన్స్ చేశాడు. పూరీ సేతుపతి వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో టబు(Tabu), దునియా విజయ్(Duniya Vijay) ను కూడా భాగం చేసి సినిమాపై అంచనాల్ని పెంచేశాడు పూరీ. సంయుక్త మీనన్(Samyuktha Menon) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా గురించి ఇప్పుడో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది.
ఈ సినిమాకు మహతి స్వర సాగర్(Mahathi Swara Sagar) సంగీతం అందిస్తున్నట్టు సమాచారం. వీరిద్దరూ కలిసి వర్క్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్. మణిశర్మ(Manisharma) కొడుకుగా చాలా కాలంగా మహతి సాగర్ పూరీకి పరిచయమే కానీ ఎప్పుడూ కలిసి పని చేసింది లేదు. మొన్నటివరకు మణిశర్మతో వర్క్ చేసిన పూరీ ఇప్పుడు తన గేర్ ను మార్చి మణి కొడుకు మహతి తో వర్క్ చేయాలని చూస్తున్నాడట. మహతి కూడా తన మ్యూజిక్ తో ఈ సినిమాకు ఫ్రెష్నెస్ ను తీసుకురావాలని చూస్తున్నాడట. బెగ్గర్(Beggar) వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి త్వరలోనే ఫస్ట్ లుక్ రిలీజ్ కానుందని సమాచారం.






