త్వరలో పొల్లాచికి మహర్షి
మహేష్‌బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మహర్షి. షూటింగ్‌కి కొంత బ్రేక్‌నిచ్చి కొత్త ఏడాది వేడుకల్లో భాగంగా కుటుంబంతో దుబాయ్ వెళ్లిన మహేష్, మళ్లీ షూటింగ్‌కు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. మహర్షి తదుపరి లాంగ్ షెడ్యూల్ కోసం మహర్షి టీం త్వరలో పొల్లాచి వెళ్లనుందట. సినిమాలో మహేష్‌బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. కామెడీ హీరో అల్లరి నరేశ్ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడు. నిర్మాతలు దిల్‌రాజు, అశ్వినీదత్ సంయుక్తగా నిర్మిస్తున్న చిత్రం శాటిలైట్ హక్కులను జెమినీ టీవీ దక్కించుకుంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.













