SSMB29: మహేష్ కు తండ్రిగా మాధవన్?

సూపర్ స్టార్ మహేష్ బాబు(mahesh babu), దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) కాంబినేషన్ లో వస్తోన్న సినిమా ఎస్ఎస్ఎంబీ29(SSMB29). వీరిద్దరి కలయికలో వస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై అందరికీ ఓ రేంజ్ లో అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అందుకే ఈ మూవీకి సంబంధించి ఎలాంటి వార్త వచ్చినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఇప్పుడో వార్త నెట్టింట తెగ వినిపిస్తోంది. తాజాగా ఎస్ఎస్ఎంబీ29 షూటింగ్ లో మాధవన్(Madhavan) జాయిన్ అయ్యారని తెలుస్తోంది. ఈ మూవీలోకి మహేష్ బాబు కు తండ్రిగా మాధవన్ నటించనున్నారని అంటున్నారు. గతంలో ఇదే పాత్ర కోసం విక్రమ్(Vikram), నానా పటేకర్(Nana Patekar) ను అడిగారని కూడా అన్నారు. కానీ ఇప్పుడా పాత్రలో మాధవన్ నటిస్తున్నారంటున్నారు.
అయితే ఈ విషయంలో ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడింది లేదు. కానీ ఈ వార్త నిజమై ఒకవేళ నిజంగా మాధవన్, మహేష్ కు తండ్రి పాత్రలో నటిస్తే సినిమాపై ఉన్న హైప్ మరింత పెరగడం ఖాయం. మామూలుగానే మాధవన్ ఎంతో గొప్ప నటుడు. అలాంటి అతను రాజమౌళి దర్శకత్వంలో ఇంకెంత మెరుగైన ప్రదర్శన ఇస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏదేమైనా ఈ సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసేవరకు దేన్నీ నిజమని నమ్మలేం. ప్రియాంక చోప్రా(priyanka chopra) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.